ETV Bharat / entertainment

పూజా హెగ్డే ఇంట్లో విషాదం - బాధలో బుట్టబొమ్మ - పూజా హెగ్డే ఇంట్లో విషాదం

Pooja Hegde Grandmother Passed Away : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు

పూజా హెగ్డే ఇంట్లో విషాదం - బాధలో బుట్టబొమ్మ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 12:57 PM IST

Updated : Jan 14, 2024, 12:25 PM IST

Pooja Hegde Grandmother Passed Away : టాలీవుడ్​లో ఆ మధ్యలో స్టార్ హీరోయిన్​గా రాణించిన పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె ఎంతగానో ఇష్టపడే తన అమ్మమ్మను కోల్పోయింది. దీంతో పూజా హెగ్డే ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమె కుటుంబ సభ్యులందరూ ఎంతో బాధలో ఉన్నారు. ఈ విషయాన్ని పూజ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. 'విల్‌ మిస్‌ యూ అజ్జి' అంటూ గతంలో తమ అజ్జితో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో ఫుల్​ వైరల్ అవుతోంది. దీంతో పూజాను అభిమానులు ఓదార్చుతున్నారు. ఇకపోతే రీసెంట్​గా బుట్టబొమ్మ తన చెల్లెలు భూమి పెళ్లిలో సందడి చేస్తూ కనిపించింది. అంతలోనే తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోవడం వల్ల విషాదంలో మునిగిపోయింది. గతంలో కూడా పూజా తన అమ్మమ్మతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.

Pooja Hegde Upcoming Movies : కాగా, చాలా కాలంగా పూజా హెగ్డేకు సరైన సక్సెస్​ దక్కలేదు. 2021 నుంచి ఆమె చేసిన రాధేశ్యామ్​, బీస్ట్, ఆచార్య, సర్కస్​(హిందీ) చిత్రాలు అన్నీ డిజాస్టర్​గా నిలిచాయి. ఇక గతేడాది బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్ కిసి కీ జాన్ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వ‍ద్ద అంతగా మెప్పించలేకపోయింది. అంతగా వసూళ్లేమీ రాలేదు. ఆ తర్వాత తెలుగులో సూపర్ స్టార్​ మహేశ్​ బాబు - మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్​ కాంబో గుంటూరు కారం సినిమాలో ఛాన్స్‌ కొట్టేసినప్పటికీ ఆ తర్వాత మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేసి ఫ్యాన్స్​కు షాక్ చేసింది. ఇక అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. కేవలం ఒక్కటి మాత్రమే ఉంది. దేవ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.

'గుంటూరు కారం' ఓపెనింగ్స్​ - ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

'హనుమాన్' ర్యాంపేజ్​​ - ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

Last Updated : Jan 14, 2024, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.