Tollywood MultiStarrer Movies 2024 : సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే కొందరు హీరోలు కలిసి నటిస్తున్నారు. మరికొందరు మేము కూడా రెడీ అనే సంకేతాలు ఇస్తున్నారు. మరి 2024లో మల్టీస్టారర్‌గా ఎవరెవరు కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేశ్ కలిసి వస్తే ఆ లెక్క వేరు ఉంటుంది. రీసెంట్గా వెంకీ 75 సినిమాల జర్నీని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలో చిరు మాట్లాడుతూ వెంకీతో కలిసి యాక్ట్ చేయడానికి సై అని చెప్పారు. వెంకీ కూడా చిరు సైగ చేస్తే చాలు వెనక నుంచి నేను వచ్చేస్తా అంటూ అన్నారు. అంటే ఇక కథ ఉంటే చాలు ఇద్దరు కలిసి నటించడమే ఆలస్యం అన్నమాట.
కింగ్ నాగార్జున ఇప్పటికే యంగ్ హీరోస్ అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్‌తో కలిసి 'నా సామిరంగ' సినిమా చేశారు. నేడు(జనవరి 14) సినిమా రిలీజ్ అయింది. వెంకటేశ్ - నాని హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ వచ్చే అవకాశం ఉందని చిత్రసీమలో ప్రచారం ఊపందుకుంది. 'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించే చిత్రం ఇదే అవొచ్చు. ఇకపోతే ఆ మధ్యలో గతేడాది రవితేజ - నాని కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కలిసి సినిమా చేద్దామనే ఓ నిర్ణయం తీసుకున్నారు. అలానే రవితేజ, కొందరు యంగ్ హీరోలతో కలిసి కొన్ని ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తున్నారు. అలా ఈ ఏడాది ఆరంభంలోనే మల్టీస్టారర్ సినిమాలపై టాలీవుడ్‌లో నడుస్తున్న చర్చ ప్రస్తుతం మూవీ లవర్స్‌ను బాగా ఆకర్షిస్తోంది.
అంత ఈజీ కాదు : అయితే మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కడం అంత ఈజీ కాదు. చిత్రసీమను గమనిస్తే సీనియర్ హీరోలు, యంగ్ హీరోల కాంబోలో సినిమాలు కుదిరినట్టు ఒకే స్థాయి తారల సినిమాలు కుదరడం కష్టం. గతేడాది చిరంజీవి - రవితేజ కాంబోలో 'వాల్తేరు వీరయ్య' వచ్చింది. అయితే చిరు నటిస్తున్న కొత్త చిత్రాల్లో మాత్రం పలువురు యంగ్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి తప్పా సమ ఉజ్జీలైన కథానాయకుల పేర్లు వినపడట్లేదు. అదే సమ ఉజ్జీలైన హీరోల కలిసి నటిస్తే ఆ హంగామానే వేరు. కానీ ఇదంతా జరగాలంటే మొదట కథ కుదరాలి. ఆ తర్వాత కథానాయకులు ఇద్దరికీ సమయం కుదరాలి. అదంతా జరిగినప్పుడే ఇలాంటి చిత్రాలు పట్టాలెక్కే అవకాశాలు ఉంటాయి. అసలు వీటన్నింటికన్నా ముఖ్యం మార్కెట్ లెక్కలు కుదరడం. ఎందుకంటే ఇద్దరు బడా హీరోలు కలిసి నటిస్తున్నప్పుడు వారి రెమ్యునరేషన్లు, ఆ సినిమాల స్థాయికి తగ్గట్టుగా మార్కెట్ ఉండాల్సి ఉంటుంది. అందుకే ఆ లెక్కల సరిగ్గా కుదరక చాలా సినిమాలు ఆదిలోనే ఆగిపోతున్నాయనేది సినీ వర్గాలు చెబుతున్న మాట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సంక్రాంతి ఫైట్‌లో 100% సక్సెస్ రేట్- ఈ పాత్రలు కెరీర్లోనే హైలైట్!
OTTలో అదరగొడుతున్న 90s మిడిల్ క్లాస్- 120000000 మినిట్ వ్యూస్‌తో టాప్ రేటింగ్‌లో