ETV Bharat / entertainment

అందంగా ఉందని చూశా.. మాస్టర్​కు కంప్లైంట్‌ చేసింది : విజయేంద్ర ప్రసాద్​ - writer vijayendra prasad o saathiya movie chitchat

Vijayendra Prasad : తాను చదువుకునే రోజుల్లో తన ఫస్ట్​ క్రష్​ చేసిన పనికి గుండె ఝల్లుమంది అని సినీ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. 'ఓ సాథియా' సినిమా టీమ్​తో చిట్​చాట్​ సమయంలో ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Vijayendra Prasad on Crush
Vijayendra Prasad on Crush
author img

By

Published : Jul 3, 2023, 10:48 PM IST

Updated : Jul 3, 2023, 11:06 PM IST

Vijayendra Prasad : ఫోర్త్‌ ఫారం చదివే రోజుల్లో తన ఫస్ట్​ క్రష్​ చేసిన పనికి గుండె ఝల్లుమన్నంత పనైందని ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. 'ఓ సాథియా' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా నిర్వహించిన ఓ చిట్​చాట్​ కార్యక్రమంలో చిత్ర బృందంతో మాట్లాడుతున్న సమయంలో ఆయన తన చిన్నప్పటి ఫస్ట్‌ క్రష్‌ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

'ఈ సినిమా ఫస్ట్​లవ్​ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే మీ జీవితంలో ఫస్ట్​లవ్​ గురించి ఏమైన చెబుతారా..? అని మూవీ టీమ్​ విజయేంద్ర ప్రసాద్‌ను సరదాగా అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 'సాధారణంగా దాన్ని లవ్‌ అని అంటుంటాం. కానీ, అది లవ్‌ కాదు క్రష్‌. అయితే నా ఫస్ట్‌క్రష్‌ పేరు రాధ. నేను ఫోర్త్‌ ఫారం చదివే రోజులవి. అప్పుడు నా వయసు సుమారు 11 ఏళ్లు. ఆమె నాకంటే కాస్త పెద్దది. చాలా అందంగా ఉండేది. దీంతో ట్యూషన్‌ క్లాస్‌లో ఆమెను అలానే చూస్తూ ఉండేవాణ్ని. దాన్ని గమనించిన ఆమె మాస్టర్‌ దగ్గరకు వెళ్లి నాపై కంప్లైంట్‌ చేసింది. అప్పుడు ఆమె చేసిన పనికి నా గుండె ఝల్లుమంది. అయితే నేనంటే ఆ సర్‌కు ఇష్టం. అప్పుడు మాస్టార్​.. 'ప్రసాద్‌ నీ వైపు చూస్తున్నాడని నీకెలా తెలుసు?' అని రాధను ప్రశ్నించారు. 'ఆయన చూడటం నేను చూశాను' అని తాను సమాధానం చెప్పడంతో.. 'మరి ప్రసాద్‌ను నువ్వెందుకు చూశావ్‌' అని ఆయన తిరిగి ప్రశ్నించారు' అని ట్యూషన్​ క్లాస్​లో జరిగిన సరదా సన్నివేశాన్ని విజయేంద్ర ప్రసాద్‌ పంచుకున్నారు.

ఆర్యన్​ గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన 'ఓ సాథియా' చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌ శిష్యురాలు దివ్య భావన దర్శకత్వం వహించారు. ఈ నెల 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్‌ ఆ చిత్ర బృందంతో ముచ్చటించారు. మనిషిలో చిత్తశుద్ధి ఉంటే లక్ష్యానికి దారులు తప్పక ఉంటాయని.. దానికి ప్రకృతి కూడా సహకరిస్తుందని ఈ సందర్భంగా ఆయన​ అన్నారు.

'బాహుబలి', 'బజరంగీ భాయిజాన్', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'మణికర్ణిక', వంటి ఎన్నో సూపర్​ హిట్‌ సినిమాలకు కథలను అందించారు విజయేంద్ర ప్రసాద్​. ప్రస్తుతం సూపర్​స్టార్​ హీరో మహేశ్‌ బాబు, దర్శకుడు ఎస్​ఎస్​ రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న #SSMB29 (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాకి స్టోరీ రాస్తున్నారు. గ్లోబల్‌ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది.

Last Updated : Jul 3, 2023, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.