ETV Bharat / entertainment

సొగసరి.. సాహసాలు..గడసరి.. పోరాటాలు - tollywood heroines

Tollywood heroines action movies: "నటనలో సరికొత్త లోతులు చూడాలి.. సవాల్‌ విసిరే పాత్రలతో సవారీ చేయాలి".. ఈతరం నాయికల ఆలోచనలన్నీ ఈ కోణంలోనే సాగుతున్నాయి. రెండు ప్రేమ సన్నివేశాలు.. మూడు పాటలు.. అంటూ సాగే మూస ధోరణి పాత్రల్ని మొహమాటం లేకుండా పక్కకు నెట్టేస్తున్నారు. తమ ప్రతిభను నిత్యనూతనంగా ఆవిష్కరించేందుకు యాక్షన్‌ దారుల్లో పయనిస్తున్నారు. తుపాకులు చేత బట్టి హీరోలకు దీటైన యాక్షన్‌ హంగామా రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వారెవరో ఓ సారి లుక్కేద్దాం..

Tollywood heroiens action movies
సొగసరి.. సాహసాలు..గడసరి.. పోరాటాలు
author img

By

Published : Apr 28, 2022, 6:30 AM IST

Tollywood heroines action movies: సొగసరి భామలు.. యాక్షన్‌ పాత్రలతో అలరించడం కొత్తేమీ కాదు. ఆ తరం నాయికలు విజయశాంతి, రోజా మొదలు.. ఈతరం భామలు అనుష్క, సమంత వరకు.. చాలా మంది యాక్షన్‌ అవతారాల్లో మెప్పించిన వాళ్లే. కీర్తి సురేష్‌ 'చిన్ని' చిత్రంలో ఇలాంటి సాహసోపేతమైన పాత్రలోనే నటిస్తోంది. సామ్‌ ఇటీవలే 'ది ఫ్యామిలీమ్యాన్‌-2' వెబ్‌సిరీస్‌తో అదిరిపోయే యాక్షన్‌ను రుచి చూపించి, సినీప్రియుల్ని మెప్పించింది. ఇప్పుడు 'యశోద'తో వెండితెరపై యాక్షన్‌ ధమాకా చూపించేందుకు సిద్ధమవుతోంది. హరి-హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తోంది. విభిన్నమైన నాయికా ప్రాధాన్య కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది. అందుకే ఈ చిత్రం కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ యానిక్‌ బెన్‌ను రంగంలోకి దించింది చిత్ర బృందం. ఆయన ఆధ్వర్యంలో సామ్‌పై ఇప్పటికే పలు కీలక యాక్షన్‌ ఎపిసోడ్లు చిత్రీకరించారు. మరో భారీ సీక్వెన్స్‌ను కొడైకెనాల్‌లో చిత్రీకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ.. తెలుగులో అనూహ్యంగా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోన్న ఉత్తరాది అందం సోనాల్‌ చౌహాన్‌. 'లెజెండ్‌' నుంచి 'రూలర్‌' వరకు ఎక్కువగా గ్లామర్‌ పాత్రలతోనే మురిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు 'ది ఘోస్ట్‌'తో తనలోని యాక్షన్‌ కోణాన్ని పరిచయం చేయనుంది. నాగార్జున కథానాయకుడు. ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్నారు. నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నాగ్‌తో కలిసి సాహసోపేతమైన పోరాటాలు చేయనుంది సోనాల్‌. అందుకే ఈ పాత్ర కోసం ఆమె మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీరోచిత పాత్రలో.. ఓ వైపు గ్లామర్‌ నాయికగా మెప్పిస్తూనే.. మరోవైపు నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనూ అలరించే ప్రయత్నం చేస్తోంది రష్మిక. ఇప్పుడామె ‘సీతా రామం’లో ఓ వీరోచిత పాత్రలో నటిస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌ కథా నాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. మృణాళిని ఠాకూర్‌ నాయిక. అశ్విని దత్‌, ప్రియాంక దత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్నమైన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు దుల్కర్‌. అఫ్రీన్‌ అనే కశ్మీరీ ముస్లిం అమ్మాయిగా రష్మిక కనిపించనుంది. ఇందులో యాక్షన్‌కు ఆస్కారముందని సమాచారం. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

యాక్షన్‌ ట్రీట్‌... కెరీర్‌ ఆరంభం నుంచీ నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనే ప్రయాణిస్తూ వస్తోంది నటి నివేదా థామస్‌. ఇప్పుడామె నటించిన తొలి నాయికా ప్రాధాన్య చిత్రం ‘శాకినీ ఢాకినీ’. సుధీర్‌ వర్మ తెరకెక్కించారు. రెజీనా మరో నాయికగా నటించింది. కొరియన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’కు రీమేక్‌గా రూపొందింది. ఇందులో నివేదా, రెజీనా ట్రైనీ పోలీసులుగా నటించారు. ఈ సినిమా కోసం వీరిద్దరూ డూప్‌ లేకుండా పోరాట ఘట్టాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఓ కిడ్నాప్‌ కేసు ఛేదించే క్రమంలో ఇద్దరు ట్రైనీ పోలీస్‌లకు ఎదురైన సవాల్లేంటి? దాని కోసం వాళ్లెలాంటి సాహసాలు చేశారు? అన్నది చిత్ర కథాంశం. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ లేడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: 'మీ డబ్బింగ్ సినిమాలు మాకెందుకు'.. స్టార్ నటుల ట్విట్టర్ వార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.