ETV Bharat / entertainment

రవితేజ రేంజ్​ మామూలుగా లేదుగా.. 'వాల్తేరు వీరయ్య' కోసం అన్ని కోట్లా? - రవితేజ రెమ్యునరేషన్

మాస్​ మహారాజ రవితేజ నటించిన 'ధమాకా' చిత్రం ఇటీవలే విడుదలై.. హిట్​ టాక్​ సొంతం చేసుకుంది. అయితే రవితేజ రెమ్యునరేషన్ గురించి ఓ వార్త నెట్టంట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మాస్​ హీరో పారితోషికం ఎన్ని కోట్లంటే..

raviteja remuneration
raviteja remuneration
author img

By

Published : Dec 29, 2022, 6:20 PM IST

మాస్​ మహారాజ రవితేజ నటించిన సినిమా 'ధమాకా' ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకున్నారు రవితేజ. ఆయన మాస్​ యాక్టింగ్​ మళ్లీ యాక్టివ్​ అయ్యింది. దీనికి తోడు భీమ్స్​ సిసిరోలియో సంగీతం.. అభిమానులను కుర్చీల్లో కూర్చోనీయలేదు. భీమ్స్ డీజే బీట్​కు.. రవితేజ మాస్​ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కాగా, ఈ మాస్​ హీరో.. మెగాస్టార్​ చిరంజీవి సినిమా 'వాల్తేరు వీరయ్య'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

raviteja remuneration
రవితేజ

ఈ సినిమాలో రవితేజ దాదాపు 44 నిమిషాల పాటు స్క్రీన్​​పై కనిపించనున్నారట. ఈ చిత్రానికి గాను రవితేజ మొదట రూ. 18 కోట్లు అడిగినట్లు సమాచారం. కానీ చర్చల తర్వాత రూ. 17 కోట్లు తీసుకోడానికి ఒప్పుకున్నారని సోషల్​ మీడియాలో టాక్​ నడుస్తోంది. కాగా, ఏ సినిమాకైనా రవితేజా దాదాపు ఇదే మొత్తంలో తీసుకుంటారని సీనీ వర్గాల సమాచారం.

సారీ చెప్పిన చిరంజీవి..
తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్రబృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో ఈ సినిమాలోని సన్నివేశాలపై, చిత్ర యూనిట్‌లోని అందరి గురించి చిరంజీవి మాట్లాడారు. అయితే అన్ని విషయాలు ప్రస్తావించిన చిరు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రవితేజ గురించి మాట్లాడటం మర్చిపోయారు. దీంతో చిరంజీవికి, రవితేజకు మధ్య ఏం జరిగింది? ఎందుకు ఆయన రవితేజ గురించి మాట్లాడలేదనే చర్చ నెట్టింట మొదలైంది. తాజాగా చిరంజీవి ఈ విషయంపై స్పందించారు. రవితేజపై ప్రశంసలు కురిపిస్తూ ప్రత్యేకంగా ట్విట్‌ చేశారు.

raviteja remuneration
వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, రవితేజ

''వాల్తేరు వీరయ్య టీం ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. చిత్రబృందం వాళ్ల జ్ఞాపకాలు పంచుకోవడంతో ఈ సమావేశం ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ అంత సంతోషంగా సాగింది. అయితే నేను ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మీడియా సమావేశంలో క్లుప్తంగా మాట్లాడదామని అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా అందరి గురించి మాట్లాడిన నేను.. నా తమ్ముడు, వీరయ్యకు అతి ముఖ్యుడు రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. సమావేశం అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు ఈ విషయమై వెలితిగా ఫీలయ్యాను. అందుకే ఇప్పుడు ట్విట్‌ చేస్తున్నాను.

వాల్తేరు వీరయ్య సినిమా గురించి రవితేజకు చెప్పగానే.. అన్నయ్య (చిరంజీవి) సినిమాలో చెయ్యాలని వెంటనే అంగీకరించాడు. చాలా సంవత్సరాల తర్వాత రవితేజతో కలిసి షూటింగ్‌ పాల్గొన్నడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోతే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది. దర్శకుడు బాబీ చెప్పినట్లు 'పూనకాలు లోడింగ్‌..' రవితేజ పాత్రలో ఉంది. ఈ విషయాల గురించి త్వరలోనే మాట్లాడుకుందాం'' అని చిరంజీవి రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ చూసిన వారందరూ చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఈ ట్వీట్‌తో మీపై ఉండే గౌరవం రెట్టింపైందంటూ' కామెంట్‌ చేస్తున్నారు. ఇక చిరంజీవి సరసన శ్రుతి హాసన్‌ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.