Tiger Nageswara Rao Pre Release Event : మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాలో నుపుర్ ససన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. స్టూవర్టుపురంలో ఒకప్పుడు పేరు మోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితంలోని పలు సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకులు హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు చీఫ్ గెస్ట్లుగా హాజరయ్యారు.
టైగర్ నాగేశ్వరరావు టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన నా తమ్ముళ్లు, తమ్ముళ్లులాంటి దర్శకులకు, విజయేంద్ర ప్రసాద్‌గారికి కృతజ్ఞతలని అన్నారు రవితేజ. ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ అందంగా వచ్చిందంటే దానికి కారణం సినిమాటోగ్రాఫర్ మదీ వల్లేనని తెలిపారు. రామ్-లక్ష్మణ్, పీటర్ హెయిన్స్ పోరాట దృశ్యాలను అద్భుతంగా తీశారని ప్రశంసించారు రవితేజ. 'వంశీ కథ చెప్పగానే వెంటనే సినిమాని స్టార్ట్ చేద్దామన్నా. చాలాకాలం తర్వాత రేణూ దేశాయ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. నిర్మాణం విషయంలో అభిషేక్ అగర్వాల్ ఎక్కడా రాజీపడలేదు. వంశీ గురించి ఇప్పుడు కాదు సినిమా విడుదల తర్వాత గట్టిగా మాట్లాడతా. బాలకృష్ణ హీరోగా నా బ్రదర్‌లాంటి అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' ఈ నెల 19న రిలీజ్ అవుతోంది. అలాగే దళపతి విజయ్ 'లియో' అదే రోజున వస్తుంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని రవితేజ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మీ ప్రేమాభినాలు చూస్తుంటే 'బద్రి' సినిమా నిన్నో, మొన్నో రిలీజైనట్లు అనిపిస్తోందని అన్నారు నటి రేణూదేశాయ్. యాక్టింగ్‌కు దూరమైనా నేను కనిపిస్తే ఆప్యాయంగా పలకరిస్తుంటారని పేర్కొన్నారు. 'సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతుంటారు. ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు. 2019లోనే టైగర్ నాగేశ్వరరావులో భాగమయ్యా. కొవిడ్, ఇతరత్రా కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. ఇందులో మంచి పాత్ర పోషించే అవకాశం కల్పించిన హీరో రవితేజ, దర్శకుడు వంశీ, నిర్మాతలకు స్పెషల్ థ్యాంక్స్' అని రేణూ దేశాయ్ అన్నారు.
విజయేంద్ర ప్రసాద్‌గారు మా దర్శక, రచయితలందరికీ స్ఫూర్తి అన్నారు దర్శకుడు హరీశ్ శంకర్. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకే ఆయన ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభిస్తారని.. అందుకే ఆయన్ను బిజీయేంద్రప్రసాద్ అనొచ్చని ప్రశంసించారు. "'ఆర్‌ఆర్‌ఆర్', 'బాహుబలి'లాంటి సినిమాలకు పనిచేసిన ఆయన 'పుష్ప', 'టైగర్ నాగేశ్వరరావు' చిత్ర బృందాలను అభినందించడం ఆయన సంస్కారానికి నిదర్శనం. సుమారు 16 ఏళ్ల క్రితం ఇదే వేదికపై 'లక్ష్యం' సినిమా ఆడియో రిలీజ్ జరిగింది. కార్యక్రమ బాధ్యతలను నిర్మాత నల్లమలుపు బుజ్జి నాకు అప్పగించారు. ఈవెంట్‌కు వచ్చిన హీరోలను వేదికపైకి వారి ట్యాగ్‌తో ఆహ్వానించాం. రవితేజ స్టేజీపైకి రండి అని పిలిస్తే బాగుండదనే ఉద్దేశంతో మాస్ మహరాజ్ రవితేజ అని పిలవండని యాంకర్ సుమకు చెప్పా. ఇండస్ట్రీలో నాకంటూ ఓ పేరు, గుర్తింపు, జీవితం ఇచ్చిన రవితేజకు ఆ చిన్న ట్యాగ్ ఇచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నా. ప్రతిభను గుర్తించడంలో రవితేజకు మించినవారులేరు. నా విషయంలో నాకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి ఆయనే. త్వరలో రవితేజతో మరో సినిమా చేస్తా' అని హరీశ్ తెలిపారు.
Tiger Nageswara Rao Openings : 'టైగర్' ఓపెనింగ్స్ టార్గెట్ ఇదే.. ఆ చిత్రాన్ని బ్రేక్ చేస్తుందా?