ETV Bharat / entertainment

గురి తప్పేదేలేదెస్ అంటున్న చైతూ - ఏలియన్​తో శివ కార్తికేయన్ ఫ్రెండ్​షిప్​ - Thandel movie chaitanya

Thandel Glimpse : స్టార్ హీరో నాగచైతన్య లీడ్ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'తండేల్​'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్​ విడుదలైంది. మరోవైపు శివకార్తికేయన్​ తాజా మూవీ అయాలాన్​ ట్రైలర్​ కూడా నెట్టింట సందడి చేస్తోంది. ఆ విశేషాలు మీ కోసం.

Thandel Glimpse
Thandel Glimpse
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 12:05 PM IST

Updated : Jan 6, 2024, 2:12 PM IST

Thandel Glimpse : టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ 'తండేల్​'. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న‌ ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ గ్లింప్స్​ విడుదలైంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్​ ఆ వీడియోను నెట్టింట అప్​లోడ్​ చేశారు. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో చైతూ లుక్​తో పాటు యాక్షన్ అదిరిందంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు.

బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ 'దద్దా గుర్తెట్టుకో ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్ ఇక రాజులమ్మ జాతరే' అంటూ చెప్పే ఓ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అతడు పాక్ ప్రభుత్వానికి చిక్కడం, అక్కడ జైల్లో ఇబ్బంది పెడుతున్న అధికారికి కౌంటర్ ఇవ్వడం లాంటి సన్నివేశాలను చూపించారు. చివర్లో సాయిపల్లవిని అలా చూపించి టీజర్‌ని ముగించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తండేల్ మూవీలో బలమైన లవ్ స్టొరీని కూడా డైరెక్టర్ చందూ మొండేటి చూపించనున్నారు. ఈ సినిమాకి కార్తిక్ స్టోరీని అందించారు. అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బతుకుదెరువు కోసం గుజరాత్​లోని వీరవల్​కు వెళ్లిన హీరో వేట సమయంలో చేస్తూ పాకిస్థాన్ కోస్టు గార్డులకు చిక్కుతాడు. దీంతో అతడితో పాటు అక్కడున్న వారందరిని అరెస్ట్ చేసి జైలులో పెట్టేస్తారు పాకిస్థాన్ పోలీసులు. ఆ తర్వాత జైలు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేది తండేల్ స్టోరీ. దేశభక్తి ఓ అందమైన ప్రేమ కథను జత చేసి ఈ సినిమాను కమర్షియల్​గా రూపొందిస్తున్నారు.

Ayalaan Trailer : మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌, రకుల్​ ప్రీత్ సింగ్​ కాంబోలో వచ్చిన మూవీ 'అయలాన్‌'. గ్రహాంతర వాసి నేపథ్యంతో, భారీ విజువల్స్‌తో రవి కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్​ను మూవీ టీమ్​ విడుదల చేసింది. శివకార్తికేయన్‌ నటన, డైలాగ్స్‌ సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

నాగ చైతన్య 'తండేల్​' గ్రాండ్ లాంఛ్​ - స్పెషల్ అట్రాక్షన్​గా సాయి పల్లవి!

'ఆ సినిమాల్లో నేను అస్సలు నటించను - దానికి మైనస్‌ నేనే'

Last Updated : Jan 6, 2024, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.