ETV Bharat / entertainment

Thalaivar 171 update : తలైవా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఆ స్టార్ డైరెక్టర్​తో రజనీ మూవీ ఫిక్స్ - తలైవార్ సినిమా షూటింగ్ అప్​డేట్

Thalaivar 171 update : జైలర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రజనీ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్. ఆయన తాజా సినిమా గురించి ఓ అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చింది. అదేంటంటే?

Thalaivar 171
Thalaivar 171
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 1:08 PM IST

Updated : Sep 11, 2023, 2:33 PM IST

Thalaivar 171 Update : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్. ఆయన 171 సినిమా గురించి అదిరిపోయే అప్​డేట్ వచ్చింది. 'విక్రమ్' ఫేమ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్​తో రజనీ మూవీ కన్ఫార్మ్ అయ్యింది. 'తలైవార్ 171' అనే వర్కింగ్ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కనుంది. సన్ పిక్చర్స్ బ్యానర్​పై రూపొందనున్న ఈ సినిమాకు.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఈ మేరకు సన్ పిక్చర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్​లో వెల్లడించింది.

ఇక రజనీ-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన జైలర్.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని.. అనేక రికార్డుల్ని నెలకొల్పింది. ఇది రజనీ కెరీర్​లో రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన రెండో సినిమా.

అయితే జైలర్ ప్రొడ్యూసర్స్ సంబరాల్లో ఉన్నారు. సన్ పిక్చర్స్ ఛైర్మన్, సినిమా నిర్మాత కళానిధి మారన్.. ఇటీవల హీరో రజనీ, సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్​కు ఖరీదైన కార్లు గిఫ్ట్​గా ఇచ్చారు. ఇక తాజాగా చిత్రం కోసం పనిచేసిన వారందరికీ బహుమతులు ఇచ్చి సర్​ప్రైజ్ చేశారు.

Jailer OTT Release Date : ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ ప్లాట్​ఫామ్​లోనూ ఎక్కువ వ్యూస్​ మినిట్స్‌ సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది. రజనీ యాక్టింగ్​, డైలాగులకు ఫ్యాన్స్​, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్​ కూడా వచ్చే అవకాశముందని, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ అందుకోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చని టాక్ వినిపిస్తోంది.

Lokesh Kanagaraj Movies : లోకేశ్ కనగరాజ్ విషయానికొస్తే.. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్​తో 'నగరం' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. తర్వాత కార్తీ హీరోగా..' ఖైదీ' సినిమాతో కోలీవుడ్​ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక గతేడాది కమల్ హాసన్​ హీరోగా 'విక్రమ్' సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఆయన విజయ్ దళపతితో 'లియో' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు.

Jailer Gold Coins : 'జైలర్' సక్సెస్ సెలబ్రేషన్స్.. 300 మందికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్​.. బిర్యానీ పెట్టించి మరీ

Thalaivar 170 Update : 'జైలర్' సక్సెస్​ సెలబ్రేషన్స్​లో రజనీ.. 'జై భీమ్'​ దర్శకుడితో సినిమా షురూ!

Last Updated : Sep 11, 2023, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.