ETV Bharat / entertainment

Tamannah Latest Movies : బాధను దాచుకుని నటించి.. వాళ్లందరికీ సమాధానం చెప్తూ.. - భోళా శంకర్ మూవీ రిలీజ్​ డేట్

Tamannah Latest Movies : 'కావలయ్య'... అంటూ ప్రేక్షకులను తన వైపుకు లాకున్న మిల్క్​ బ్యూటీ తమన్న.. వరుస సినిమాలతో బిజీ బీజీగా ఉంది. ఇటీవలే ఇద్దరు స్టార్​ హీరోస్​తో స్క్రీన్​ షేర్​ చేస్తున్న ఈ భామ.. ఒక్కరోజు తేడాతో థియేటర్లలో సందడి చేయనుంది. రజనీ 'జైలర్​' ఆగస్టు 10న విడుదల కానుండగా.. చిరంజీవి 'భోళా శంకర్​' ఆగస్ట్​ 11న రిలీజ్​కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో తమన్నాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీ కోసం..

Tamannaah Bhatia
Tamannaah Bhatia
author img

By

Published : Aug 8, 2023, 12:24 PM IST

Tamannah Latest Movies : మిల్క్​ బ్యూటీ తమన్న వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో అటు సౌత్​తో పాటు ఇటు నార్త్​ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ ముద్దుగుమ్మ నటనతోనే కాదు.. డ్యాన్స్‌తోనూ ఆడియెన్స్​ను అలరిస్తోంది. తాజాగా రెండు హిందీ సిరీస్​లో కనిపించిన ఆమె.. మునుపెన్నుడు చేయని బోల్డ్​ క్యారెక్టర్స్​ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ఎలాంటి పాత్రలనైనా తాను చేయగలనని మరోసారి నిరూపించింది.

అయితే ఇప్పుడు బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. చిరంజీవి, రజనీకాంత్‌ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకొని.. ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీ 'జైలర్​' ఆగస్టు 10న విడుదల కానుండగా.. చిరంజీవి 'భోళా శంకర్​' ఆగస్ట్​ 11న రిలీజ్​కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లోనూ తమన్నా ఎలా కనిపించనుందో ఓ సారి చూసేద్దామా..

'జైలర్‌'లో అలా..
Tamannah In Jailer Movie : ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్​ క్రియేట్ చేసిన 'కావాలయ్యా..' పాటలో తమన్న వేసిన స్టెప్పులు మామూలుగా లేదు మరి. అటు తెలుగుతో పాటు ఇటు తమిళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు సృష్టించింది. అయితే జైలర్​ సినిమాలో ఈ పాటలోనే కాదు.. ఓ కీలక పాత్రలో కూడా తమన్నా కనిపించనుంది. ఈ క్రమంలో ఈ సినిమాలో ఆమె రోల్​ ఎలా ఉండనుందో అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్​లో తమన్నా కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో హల్​చల్​ చేసిన ఫ్యాన్స్​.. ఈ సినిమాను మూవీని ట్యాగ్‌ చేస్త 'తమన్నా ఎక్కడ?..' అని నెట్టింట పోస్ట్‌లు కూడా పెట్టారు. అయితే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను మేకర్స్​ ఇప్పటి వరకు రివీల్‌ చేయలేదు. ఇక ఈ విషయం తెలియాలంటే.. ఆగస్ట్​ 10 వరకు వేచి చూడక తప్పదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'భోళా శంకర్‌'లో ఇలా..
Tamannah In Bhola Shankar Movie : మెగాస్టార్​ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'భోళా శంకర్'లో చిరంజీవి సరసన తమన్నా నటించింది. లాయర్‌ లాస్య అనే పాత్రతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది. ఇక తమన్నాకు మిల్క్​ బ్యూటీగా పేరుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ సినిమాలో అదే పేరుతో ఓ పాట కూడా ఉంది. ఇటీవలే రిలీజైన ఆ సాంగ్​లో తమన్నా, చిరు ఇద్దరూ కలిసి సూపర్​ స్టెపులతో అదరగొట్టారు.

ఇక ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన తమన్నా.. చిరంజీవితో కలిసి రెండో సారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపింది. ''సైరా'లో చిరంజీవితో కలిసి నటించాను. కానీ, అప్పుడు ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేసే అవకాశం నాకు రాలేదు. కానీ 'భోళా శంకర్‌'లో మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. ఆయన ఓ గొప్ప డ్యాన్సర్‌. 'మిల్కీ బ్యూటీ' పాటలో ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు మంచి అనుభవాన్నిచ్చింది'' అని పేర్కొంది. తమిళంలో విడుదలైన 'వేదాళం' సినిమాకు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వారికి తన స్టైల్​లో రిప్లై..
Tamannah Latest Interview : ఇక ఈ ఇద్దరి హీరోలకు, తమన్నాకు మధ్య ఏజ్​ గ్యాప్​ చాలా ఉందంటూ కొందరు ఆమెను విమర్శించారు. అలాంటి వారికి తమన్నా తన స్టైల్​లో కౌంటర్​ ఇచ్చింది. సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనప్పుడు ఈ విషయంపై ఆమె స్పందించింది. 'మీ కంటే వయసులో చాలాపెద్దవారి సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారెందుకు?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం చెప్పిన తమన్నా.. సినిమాల్లో నటీనటుల మధ్య వయసు వ్యత్యాసాన్ని ఎందుకు చూస్తున్నారంటూ యాంకర్​కు కౌంటర్​ ఇచ్చింది. సినిమాలో నటించే రెండు పాత్రలను మాత్రమే చూడాలని సూచించింది. తాను 60 ఏళ్ల వయసులోనూ టామ్‌ క్రూజ్‌లా విన్యాసాలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. అప్పుడు కూడా డ్యాన్స్‌ చేయాలనుందంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చిరంజీవి, రజనీకాంత్‌ లాంటి గొప్ప స్టార్స్​తో పనిచేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందంటూ పేర్కొంది.

బాధను దాచుకుని నటించి..
Tammannah Bhola Shankar Movie : తాజాగా జరిగిన 'భోళా శంకర్‌' ప్రమోషన్స్​లో తమన్నా గురించి చిరంజీవి చెప్పిన ఓ విషయంతో సినీప్రియులకు ఆమెపై గౌరవం పెరిగింది. ఆమెకు సినిమాలంటే ఎంత ఇష్టమో చిరంజీవి చెప్పారు. 'మిల్కీ బ్యూటీ' సాంగ్ షూటింగ్​ సమయంలో తమన్నా వాళ్ల నాన్నకు పెద్ద సర్జరీ జరిగిందని ఆ సమయంలోనూ చిత్రీకరణలో పాల్గొందని తెలిపారు. షాట్‌ మధ్యలో ఫ్యామిలీతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పేదని అన్నారు. తనకు ఎంత బాధ ఉన్నప్పటికీ దాన్ని దాచుకుని కెమెరా ముందుకు రాగానే డ్యాన్స్‌లో లీనమయ్యేదని.. తమన్నాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని చిరంజీవి మెచ్చుకున్నారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు కూడా మిల్క్​ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

'నా కెరీర్‌లో ఇదో మర్చిపోలేని మలుపు'
Tamannah Latest Movies : ఇక ఈ రెండు సినిమాల గురించి తమన్నా మాట్లాడుతూ సంతోషంగా ఉందని తెలిపింది. ఇవి రెండు ఒకేసారి విడుదలవుతున్నాయని ఓ కథానాయికగా ఇంతకంటే తానేం కోరుకోవడం లేదని చెప్పింది. ఇదో కలలా ఉందని.. తన కెరీర్‌లో ఇది మర్చిపోలేని మలుపని ఆనందం వ్యక్తం చేసింది. ఈ రెండూ తనకు ఎప్పటికీ ప్రత్యేకమైనవేనని తమన్నా తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.