ETV Bharat / entertainment

సినిమాల్లో నో ఛాన్స్- అయినా ఆదాయంలో మాత్రం టాప్ - మిల్కీ బ్యూటీ టెక్నిక్​ ఏంటో తెలుసా! - తమన్నా భాటియా మూవీస్ లిస్ట్

Tamannaah Bhatia Net Worth : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్​లో దూసుకెళ్తోంది. 'భోళా శంకర్' తర్వాత తెలుగు తెరపై కనిపించని ఈ ముద్దుగుమ్మ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని బిజీగా ఉంది. అయితే ఆఫర్ల రాకున్నా ఈ చిన్నది తన ఆదాయం మాత్రం తగ్గకుండా చూసుకంటోందట. అది ఎలాగంటే ?

Tamannaah Bhatia
Tamannaah Bhatia
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 3:00 PM IST

Updated : Dec 12, 2023, 3:33 PM IST

Tamannaah Bhatia Net Worth : జానర్ ఏదైనా సరే తన నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. చాంద్​ సా రోషన్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచమైన ఈ చిన్నది ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెరిసింది. అగ్ర తారల సరసన నటించింది. అలా అనతికాలంలోనే స్టార్​డమ్​ అందుకుని టాప్ హీరోయిన్​ లిస్ట్​లో చేరుకుంది. అలా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా అదే జోరు కొనసాగిస్తోంది. 'భోళాశంకర్‌', 'జైలర్‌' లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించి నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్​తో అందరినీ ఫిదా చేస్తోంది.

Tamannaah Bhatia Upcoming Movies : అయితే ఈ రెండు సినిమాల తర్వాత తమన్నా లైనప్​లో కొత్త తెలుగు చిత్రాలు యాడ్​ అవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ తమన్నా క్రేజ్​ తగ్గిపోతోందేమో అంటూ దిగులు పడ్డారు. కానీ తమన్నా మాత్రం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన సత్తా చాటేందుకు సిద్ధమౌతోంది. అలా తాజాగా తమిళ చిత్రం 'అరన్మణై- 4' సినిమాలో నటిస్తోంది. మరోవైపు దీంత పాటు పలు మలయాళం హిందీ చిత్రాలను కూడా చేస్తోంది. మరోపైవు బాలీవుడ్​లో సూపర్ హిట్ టాక్ అందుకున్న 'స్త్రీ' సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కుతున్న 'స్త్రీ-2'లో ఓ స్పెషల్ సాంగ్​కు తమన్నా సైన్​ చేసిందట. అంతే కాకుండా బీ టౌన్ స్టార్ జాన్​ అబ్రహమ్​తో 'వేదా' అనే చిత్రం కోసం స్క్రీన్​ షేర్ చేసుకోనుంది.

మరోవైపు ఈ మిల్కీ బ్యూటీకి అవకాశాలు తగ్గాయేమో కానీ ఆదాయం ఆర్జించడంలో మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఒకవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు ఈ చిన్నది వ్యాపారంగంలో దృష్టి సారిస్తోంది. పలు యాడ్స్​తో పాటు ఈవెంట్స్​లో మెరుస్తూ మంచి క్రేజ్ సంపాదిస్తోంది. అలా తన నెట్​ వర్త్​ను తగ్గకుండా బ్యాలెన్స్​ చేసుకుంటోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం తమన్నాకు రానున్న కాలంలో ఓ సాలిడ్ హిట్​ పడి సినీ ఇండస్ట్రీలో మరోసారి ఈ చిన్నది ఫామ్​లోకి రావాలని ఆశిస్తున్నారు.

Tamannaah Dance : అభిమానితో కలిసి స్టెప్పులేసిన తమన్నా.. వీడియో వైరల్

Tamannaah Bhatia Latest Photos : మిల్కీ బ్యూటీ ఎమోషనల్​ పోస్ట్​.. వారికి థ్యాంక్స్ చెప్తూ..

Last Updated : Dec 12, 2023, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.