ETV Bharat / entertainment

రిషబ్ శెట్టికి రజనీ 'బంగారు' బహుమతులు​ .. 'కాంతార' మూవీకి సూపర్​స్టార్ ఫిదా.. - రిషబ్​ షె

'కాంతార' సినిమా దేశవ్యాప్తంగా మంచి హిట్ అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్.. రిషబ్ శెట్టిను అభినందించారు. ఇంటికి పిలిచి మరీ ఖరీదైన బహుమతులను అందించారు.

Rajnikanth Rishab Setty
Rajnikanth Rishab Setty
author img

By

Published : Nov 17, 2022, 11:59 AM IST

Rajnikanth Rishab Setty: కన్నడ సినిమా 'కాంతార' సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా.. అక్కడ భారీగా విజయం సాధించడంతో ఇతర భాషల్లో కూడా రిలీజ్​ చేశారు. విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా రచన, దర్శకత్వం కూడా రిషబ్ శెట్టినే చేయడం విశేషం.

అయితే 'కాంతార' సినిమాపై ఇప్పటికే హీరో ప్రభాస్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితర సినీ ప్రముఖలు ప్రశంసల వర్షం కురిపించారు. రిషబ్​ శెట్టి నటనకు ఫిదా అయ్యారు. తాజాగా రిషబ్ శెట్టికి తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్ నుంచి ప్రశంసలు మాత్రమే కాదు, ఖరీదైన బహుమతులు లభించాయి. రిషబ్​ను చెన్నైలోని తన నివాసానికి రజనీ ఆహ్వానించి సత్కరించారు.

Rajnikanth Rishab Setty
రిషబ్​ను సత్కరిస్తున్న రజనీ

అంతేకాకుండా రిషబ్​కు గోల్డ్ చైన్, గోల్డ్ లాకెట్​ను బహుమతిగా అందించారు. కాంతార సినిమా చాలా బాగుందని, అద్భుతమైన సినిమాను తీశావంటూ రిషబ్​ను ప్రశంసించారు. గతంలోనే రజనీ ఆ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా మాస్టర్ పీస్ అని, 50 ఏళ్లకోసారి గానీ ఇలాంటి సినిమాలు రావని, సినిమా తనకు గూస్ బంప్స్ తెప్పించిందంటూ ట్వీట్ చేశారు.

Rajnikanth Rishab Setty
రిషబ్​తో రజనీ ముచ్చట్లు

అయితే వీరిద్దరి కలయికపై అభిమానులు సోషల్​మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. త్వరలో వీరిద్దరి కాంబోలో సినిమా ఉండబోతోందా? అనే టాక్ కూడా నడుస్తోంది. అందుకే రిషబ్ శెట్టిని రజనీ ఇంటికి ఆహ్వానించారని, భవిష్యత్ ప్రాజెక్టులపై వీరిద్దరూ కాసేపు ముచ్చటించారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.