ETV Bharat / entertainment

ఎన్నో 'సూపర్' హిట్​ పాటలు.. మరెన్నో అదిరిపోయే డైలాగ్​లు.. మీసాల 'కృష్ణుడి' మహిమతో - సూపర్​ స్టార్​ కృష్ణ డైలాగ్స్

ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిన సూపర్​స్టార్ కృష్ణ​ అదే రేంజ్​లో ఎన్నో మధురమైన పాటలను సినీ ప్రేక్షకులకు అందించారు. అందుకే ఆయన సినిమాల్లో సింహభాగం మ్యూజికల్‌ హిట్లుగా నిలిచాయి. అంతే కాకుండా 'అగ్గిపెట్టె ఉందా..' అల్లూరి సీతారామారాజులోని ఆ డైలాగ్​ ఇప్పటికీ అభిమానుల చెవుల్లో మారుమోగిపోతుంటాయి. అలాంటి కొన్ని హిట్​ సాంగ్స్ అండ్​ డైలాగ్స్​​ లిస్ట్​ మీ కోసం..

superstar krishna movies hit songs and famous dialogues list

author img

By

Published : Nov 16, 2022, 7:08 AM IST

పసందైన పాటలకు నెలవు కథానాయకుడు కృష్ణ చిత్రాలు. మంచి సంగీతాభిరుచి కలిగిన ఆయన.. తన సినిమాల పాటల ఎంపికలో ఎంతో ప్రత్యేకత కనబర్చేవారు. అందుకే ఆయన సినిమాల్లో సింహభాగం మ్యూజికల్‌ హిట్లుగా నిలిచాయి. అప్పట్లో కృష్ణ చిత్రాల పాటల క్యాసెట్లకు, పాటల పుస్తకాలకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. 'సాక్షి'లోని "అమ్మ కడుపు చల్లగా.." పాట నుంచి.. 'సింహాసనం'లోని "జింతాన జింతాన" పాట వరకు వందల చిత్రాల్లో ఎన్నో విజయవంతమైన పాటలు వినిపించారు కృష్ణ.

ఆయన చేసిన 'దేవదాస్‌' బాక్సాఫీస్‌ ముందు చేదు ఫలితాన్ని అందుకున్నా.. సంగీత పరంగా చక్కటి ఆదరణనే దక్కించుకుంది. అందులోని "కల చెదిరింది.. కథ మారింది.. కన్నీరే ఇక మిగిలింది" పాట అప్పట్లో ప్రతి చోటా వినిపించేది. 'అవేకళ్లు'లోని "మా ఊళ్లో ఒక పడుచుంది..’" 'పండంటి కాపురం'లోని "బాబూ వినరా..", "మనసా కవ్వించకే", 'మీనా'లోని "పెళ్లంటే నూరేళ్లపంట" గీతాలు ఇప్పటికీ వీనుల విందుగా వినిపిస్తూనే ఉంటాయి. 'దేవుడు చేసిన మనుషులు'లోని "మసక మసక చీకటిలో", 'ఊరికి మొనగాడు'లోని "ఇదిగో తెల్లచీర.. అదిగో మల్లెపూలు" వంటి గీతాలు అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించాయి.

ఇక కృష్ణ.. రచయిత సి.నారాయణ రెడ్డిలది పాటల పరంగా సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. కృష్ణ నటించిన పలు చిత్రాలకు ప్రాచుర్యం పొందిన ఎన్నో పాటల్ని అందించిన కలం సినారేదే. "ఎన్నాళ్లో వేచిన ఉదయం" (మంచి మిత్రులు), "గువ్వలా ఎగిరిపోవాలి" (అమ్మకోసం), "వస్తాడు నా రాజు ఈరోజు"(అల్లూరి సీతారామరాజు), "మ్రోగింది కల్యాణ వీణ" (కురు క్షేత్రం), "బుగ్గ గిల్లగానే" (ముహూర్తబలం), "పాలరాతి మందిరాన" (నేనూ మనిషినే), "చందమామ రమ్మంది చూడు" (అమాయకుడు) వంటి గీతాలు నాటి తరం ప్రేక్షకుల మదిలో ఆణిముత్యాల్లా నిలిచిపోయాయి. "మల్లెపందిరి నీడలో" (మాయదారి మల్లిగాడు), "నవ్వుతూ బతకాలి రా.. తమ్ముడూ నవ్వుతూ చావాలిరా" పాటలు ఇప్పటికీ మళ్లీ మళ్లీ వినాలనిపించేవే.

కృష్ణ సినిమాల్లో వినిపించిన పాటలన్నీ ఒకెత్తైతే.. 'అల్లూరి సీతారామరాజు'లోని "తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా" గీతం మరో ఎత్తు. మహాకవి శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ఈ స్ఫూర్తిదాయక గీతానికి జాతీయ పురస్కారం దక్కింది. తెలుగులో జాతీయ అవార్డు అందుకున్న తొలి పాట ఇదే. 'సింహాసనం' సినిమాతో సంగీత దర్శకుడు బప్పీలహరిని తెలుగు తెరకు పరిచయం చేశారు కృష్ణ. 'గౌరీ' చిత్రంలోని "గల గల పారుతున్న గోదావరిలా", 'సింహాసనం'లోని "ఆకాశంలో ఒక తార", 'పచ్చని కాపురం'లోని "వెన్నెలైనా చీకటైనా.." వంటి గీతాలు రీమిక్స్‌ రూపంలోనూ ఈతరం ప్రేక్షకుల మదిపైనా చెరగని ముద్ర వేశాయి.

సూపర్​ స్టార్​ కృష్ణ

రికార్డుల అసాధ్యుడు
ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో.. 360 చిత్రాల్లో నటించిన కృష్ణ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. వాటిలో ముఖ్యమైనవి ఇవి...

  • 1983లో ఒకే నగరంలో (విజయవాడ)లో ఆరు చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్న ఏకైక ఇండియన్‌ హీరో.
  • 1972లో ఒకే ఏడాదిలో అత్యధికంగా 18 చిత్రాలు విడుదలయ్యాయి.
  • కృష్ణ హీరోగా కె.యస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాల సంఖ్య: 31
  • కృష్ణతో పనిచేసిన సంగీత దర్శకులు : 52
  • 1965 నుంచి 2009 వరకు 44 సంవత్సరాలు ఏ ఏడాదిలోనూ గ్యాప్‌ రాకుండా నటించిన ఏకైక హీరో.
  • 44ఏళ్లలో సంక్రాంతి రోజు రిలీజైన సినిమాల సంఖ్య: 30
  • కృష్ణ తెరకెక్కించిన తొలి సినిమా 'సింహాసనం' విడుదలైన థియేటర్ల సంఖ్య: 50
  • కృష్ణతో నటించిన కథానాయికలు: 80
  • కృష్ణ, జయప్రద కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు: 43
  • కృష్ణ, శ్రీదేవి కలయికలో వచ్చిన చిత్రాలు: 31
  • ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు: 25
  • త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు: 7
సూపర్​ స్టార్​ కృష్ణ

కృష్ణ తల్లి కోరికే 'ముగ్గురు కొడుకులు'

కృష్ణ సినిమాల్లోకి రావడం వెనక ఆయన తల్లి నాగరత్నమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. కృష్ణ హీరోగా ఎదిగాకా ఆమె కోరిక ఒకదాన్ని దర్శకుడు పీసీ రెడ్డితో 'ముద్దుబిడ్డ' సినిమా షూటింగులో చెప్పారట. "నాకు ముగ్గురు కొడుకులు కదా. ముగ్గురు కొడుకుల నేపథ్యంలో ఓ కథ తయారు చేయకూడదా!’ అని పీసీరెడ్డిని అడిగితే ఆయన అరగంటలో కథ చెప్పారట. ఆ చిత్రమే కృష్ణ దర్శకత్వం వహించిన 'ముగ్గురు కొడుకులు'. అందులో కృష్ణతో పాటు రమేష్‌బాబు, మహేష్‌బాబులు నటించారు.

కథానాయకుడిగానే..

సూపర్​ స్టార్​ కృష్ణ

కృష్ణ దాదాపు 350 సినిమాల్లో నటించారు. అందులో తొంభైశాతం హీరో, కీలక పాత్రలే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించినవారు అరుదు. మొదటి సినిమా 1961 నుంచి 2016లో విడుదలైన ‘శ్రీశ్రీ’ వరకు ఆయనది యాభై రెండేళ్ల సుదీర్ఘ కెరీర్‌. ఇందులో 25 చిత్రాల్లో ద్విపాత్రాభినయం, ఏడు సినిమాల్లో త్రిపాత్రాభినయం చేశారు. భార్య విజయనిర్మలతో కలిసి ఏకంగా 49 సినిమాల్లో నటించారు.

తప్పిన ప్రాణగండం

విజయ నిర్మలతో సూపర్​ స్టార్​ కృష్ణ

విజయనిర్మలతో పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం 'అమ్మ కోసం'. ఆ సినిమా షూటింగ్‌ రాజమండ్రి దగ్గర్లోని పాపికొండల్లో జరిగింది. ఆర్టిస్టులందరికీ అక్కడే వసతి ఏర్పాటు చేశారు. కృష్ణ, విజయనిర్మల కొత్త జంట కావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక బోట్‌హౌజ్‌ తయారు చేయించి దాన్ని గోదావరిలో తేలియాడేలా ఏర్పాటు చేశారు.

తాళ్లతో ఒడ్డున ఉన్న చెట్లకు కట్టేశారు. ఒకరోజు పెద్ద తుపాను, వర్షం వచ్చి ఆ బోటులోకి నీళ్లు వచ్చాయి. కృష్ణ, విజయనిర్మల ఇద్దరికీ ఈత రాదు. ఒడ్డున ఉన్నవాళ్లు హాహాకారాలు చేయసాగారు. ప్రాణాలు వదిలేసుకున్న ఆ సమయంలో స్టంట్‌మాస్టర్‌ రాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. బోటుకి తాళ్లు కట్టి వాటిని నాలుగు గుర్రాలకి బిగించి ఒడ్డుకు లాక్కొచ్చారు.

మీసాల కృష్ణుడి మహిమతో..
కృష్ణ - విజయనిర్మలను 'ఆంధ్రా ప్రేమ్‌ నజీర్‌ - షీలా'జోడీగా పిలిచేవారు. అయితే వీరి పెళ్లి వెనుక 'మీసాల కృష్ణుడు' మహిమ ఉందని కృష్ణ ఓ సందర్భంలో పంచుకున్నారు. "నేను.. విజయ నిర్మల కలిసి నటించిన తొలి చిత్రం 'సాక్షి'. ఆ సినిమా చిత్రీకరణ మొత్తం రాజమండ్రి దగ్గర్లోని 'పులిదిండి'లో జరిగింది. ఆ ఊర్లో మీసాల కృష్ణుడు గుడి ఉంది. అందులో ఓ సూపర్‌ హిట్‌ పాట చిత్రీకరణ జరిగింది. ఆరుద్ర రాసిన 'అమ్మ కడుపు చల్లగా' అనే పాటలో పెళ్లి వేడుక తతంగం మొత్తాన్నీ నాపైనా.. విజయనిర్మల మీద చాలా శాస్త్రోక్తంగా చిత్రీకరించారు బాపు.

ఆ పాట చిత్రీకరణ సమయంలో రాజబాబు 'ఈ గుడి చాలా మహిమాన్వితమైనది. ఇందులో జరిగిన మీ సినిమా పెళ్లి.. తొందర్లోనే నిజం పెళ్లి అవుతుంది' అన్నారు. అందరం సరదాగా నవ్వుకున్నాం. కానీ, సెంటిమెంట్స్‌ను నమ్మని నేను కూడా ఆశ్చర్యపోయేలా మా అనుబంధం నిజంగానే పెళ్లికి దారి తీసింది. 1969 మార్చి 24న తిరుపతిలో మా పెళ్లి జరిగింది" అంటూ ఆనాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు కృష్ణ.

అగ్గిపెట్టుందా...

సూపర్​ స్టార్​ కృష్ణ

కథానాయకుడు కృష్ణ నటన, హావభావాలు, ఆయన నృత్యాలు, సంభాషణలు చెప్పే విధానం ప్రత్యేకం. ఈతరం కుర్రకారు సైతం ఆయన హావభావాల్ని అనుకరిస్తుంటారు. ఆయన తొలినాళ్లల్లోనే సినిమాల్లో సుదీర్ఘమైన సంభాషణల్ని పలికి ప్రేక్షకుల్ని అలరించారు. 'అగ్నిపర్వతం' సినిమాలో అగ్ని జమదగ్ని... అంటూ అగ్గిపెట్టె అడిగే సన్నివేశాలు, 'వీళ్లు అడ్రస్‌ లేనివాళ్లు కాదు ఆఫీసర్‌...', 'కన్నీటికి అర్థం తెలిసిన మనుషులు, కష్టానికి నిర్వచనం తెలిసిన మనుషులే ఇలాంటి సాయం చేస్తారు ఆఫీసర్‌' అంటూ ఆయన చెప్పిన సంభాషణలు అప్పట్లో పాపులర్‌ అయ్యాయి.

వందో చిత్రం 'అల్లూరి సీతారామరాజు'లో 'ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒకొక్క విప్లవవీరుడై విజృంభించి బ్రిటిష్‌ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగి స్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు.. సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్య్ర నినాదం. స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై... నీటిలో నీటినై... నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనుషుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై... నా జాతి జనులు పాడుకునే సమరగీతాన్నై... సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా ఇక్కడ కాల్చు... వందే మాతరం' అంటూ ఆయన చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఉద్రేకానికి గురిచేశాయి.

సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. 200వ చిత్రం 'ఈనాడు'లోనూ ఆయన చెప్పిన సంభాషణలు అంతే శక్తివంతంగా సాగుతాయి. 'ఈ చేతులు పేదవాడి ఆక్రోశంతో రాటు దేలిపోయాయి. దగా పడిన తమ్ముళ్ల ఆవేదనతో కరుకు తేలిపోయాయి', 'రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులే చీకటి మాటుకు పారిపోయారు, నువ్వెంత? పర్వతంలో పరమాణువులాంటివాడివి, సముద్రంలో ఇసుక రేణువులాంటివాడివి' అనే సంభాషణల్ని కృష్ణ చెప్పిన తీరు ప్రత్యేకం.

ఇదీ చదవండి:సూపర్ స్టార్ కృష్ణ గొప్ప మనసు.. వారందరి కోసం అంత చేశారా?

సూపర్​ స్టార్​ కృష్ణ గురించి ఈ ఆసక్తికర విషయాలు ఎప్పుడైనా విన్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.