ETV Bharat / entertainment

అందుకే 'జయమ్మ పంచాయితీ' మూవీ చేశా: సుమ - Suma Jayamma Panchayati movie director

Suma Jayamma Panchayati movie: 'జయమ్మ పంచాయితీ' సినిమాను సవాల్‌గా తీసుకుని నటించినట్లు తెలిపారు యాంకర్ సుమ. ఈ మూవీ విజయం సాధిస్తే సినిమాలను కొనసాగిస్తానని చెప్పారు. నేడు(శుక్రవారం) ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా తన కెరీర్​ సహా చిత్ర విశేషాలను సుమ తెలిపారు.

suma jayamma panchayathi
సుమ జయమ్మ పంచాయితీ
author img

By

Published : May 6, 2022, 6:33 AM IST

Suma Jayamma Panchayati movie: "సౌకర్యవంతమైన స్థానంలో ఉన్నప్పుడు ఏ భయాలు ఉండవు. అక్కడి నుంచి బయటికి రావడమే ఓ సాహసం. ఇవన్నీ ఎందుకని భయపడుతూ గిరిగీసుకుని అక్కడే ఉంటే మనలో కొత్తదనాన్ని ఎలా ఆవిష్కరిస్తాం? ధైర్యం చేసి నేను సినిమా చేసినందుకు నన్ను నేనే శభాష్‌ అని భుజం తట్టుకుంటున్నా" అన్నారు సుమ. వ్యాఖ్యాతగా బుల్లితెరతో ఇంటింటికీ చేరువైన ఆమె... 'జయమ్మ పంచాయితీ'తో వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సందర్భంగా సిని సంగతులను తెలిపారు సుమ. ఆ విషయాలివీ...

"రంగస్థల నటిగా చాలా డ్రామాలు చేశా. అవతలి వాళ్ల డైలాగులూ గుర్తు పెట్టుకుని చెప్పడం, సరికొత్త పాత్రలతో సందడి చేయడం... ఇవన్నీ చాలా మిస్‌ అయ్యా. మీరు యాంకరింగ్‌ చాలా బాగా చేస్తున్నారంటూ అందరూ నన్ను మెచ్చుకునేవాళ్లే కానీ, ఇది మీరు చేయగలరా? అన్న వాళ్లు ఎవరూ లేరు. దర్శకుడు విజయ్‌కుమార్‌ 'జయమ్మ పంచాయితీ' స్క్రిప్ట్‌ని ఇచ్చి ఇది మీరు చేయగలరా? అన్నారు. ఇలాంటి మాట విని చాలా రోజులైంది కదా అనిపించింది. పైగా నా శక్తి సామర్థ్యాల్ని నేను పూర్తిగా ఆవిష్కరించలేదనే ఓ వెలితి ఉండేది. అందుకే ఓ సవాల్‌గా తీసుకుని ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. రమ్యకృష్ణ, అనుష్క... ఇలా చాలా మందిని అనుకుని రెండేళ్లుగా ఈ కథతో తిరిగారట దర్శకుడు. చివరికి నా దగ్గరికొచ్చారు. ఆయన రాసిన స్క్రిప్ట్‌ చదువుతుంటే జయమ్మ అనే పాత్రతో మొదలై... చివరి వరకూ అదే పాత్ర కనిపించింది. ఇంత నిడివి కలిగిన పాత్ర నా దగ్గరికి రావడం ఇంకెప్పుడో అని వెంటనే ఒప్పుకొన్నా".

"సుమ అనగానే హాస్యం ఆశిస్తారు ప్రేక్షకులు. జోకులు, పంచ్‌లు ఉంటాయనుకుంటారు. ఈ కథ సుమని కాకుండా జయమ్మని దృష్టిలో ఉంచుకుని పూర్తిగా ఓ గ్రామీణ కథగా రాశారు దర్శకుడు. పైగా జయమ్మ శ్రీకాకుళం యాసలో మాట్లాడుతుంది. వీటన్నిటినీ ఓ సవాల్‌గా తీసుకుని చేశా. ఇందులో జయమ్మ పంచాయితీ అంతా ఈడ్లు గురించే. ఈడ్లు అంటే శ్రీకాకుళం యాసలో చదివింపులు అని అర్థం. ఈడ్లు, సిల్లంగి (చేతబడి)... ఇలాంటి శ్రీకాకుళం నేటివిటీని ఆవిష్కరించే పదాలు ఇందులో చాలానే ఉంటాయి".

"ఇదివరకు గృహిణిగా నా పిల్లల్ని చూసుకుంటూనే టెలివిజన్‌ కార్యక్రమాలు చేశా. ఇప్పుడు మా పిల్లలే నన్ను కొత్తగా ఏదైనా చేయమని ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమా విజయవంతమైతే మరో పంచాయితీ ఉంటుంది (నవ్వుతూ). ఇప్పటికే రెండు కథలు వచ్చాయి. పూర్తిస్థాయి పాత్రలైతేనే చేస్తా, లేదంటే మళ్లీ వెళ్లి టెలివిజన్‌ కార్యక్రమాలే చేసుకుంటా. మా అబ్బాయి రోషన్‌కి చిన్నప్పట్నుంచి నటనంటేనే ఇష్టం. ఈ ఏడాది ఆఖర్లో కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు".

ఇదీ చూడండి: Sri Vishnu: 'ప్రజల కోసం వాళ్లేం చేశారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.