ETV Bharat / entertainment

యంకర్ సుమ గొంతు పట్టుకున్న హీరో గోపిచంద్​.. అసలేం జరిగింది? - గోపిచంద్​ రామ బాణం ట్రైలర్​

హీరో గోపిచంద్​.. ఓ షోలో భాగంగా యాంకర్ సుమ గొంతు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్​ అవుతోంది. అసలేం జరిగిందంటే?

Suma Adda Promo Gopichand fires on anchor suma and holds her throat
యంకర్ సుమ గొంతు పట్టుకున్న హీరో గోపిచంద్​.. అసలేం జరిగింది?
author img

By

Published : Apr 24, 2023, 6:24 PM IST

Updated : Apr 24, 2023, 7:50 PM IST

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన కొత్త సినిమా మూవీ రామబాణం. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్​గా రూపొందిన ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతకుముందు వీరి కాంబోలో 'లౌక్యం', 'లక్ష్యం' సూపర్​ హిట్​గా నిలిచాయి. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్​గా రిలీజైన టీజర్​కు మంచి సాలిడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడటం వల్ల 'రామబాణం' మూవీటీమ్​లో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా.. యాంకర్ సుమ హోస్ట్​గా ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న ఫన్​ షో 'సుమ అడ్డా' షోలో పాల్గొంది. శ్రీవాస్, గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతి హాజరై సందడి చేశారు. ఇందులో ఎప్పటిలాగే సుమ తన సరదా ప్రశ్నలు అడుగుతూ మంచి ఫన్​ అందించారు. హీరో గోపీచంద్‌ కూడా తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశారు. యాంకర్​ సుమపై పంచ్​లు వేస్తూ తెగ నవ్వించారు.

'మీరు హీరోయిన్ అయితే ఆ సినిమాలో నేను విలన్ నటిస్తా' అంటూ గోపీచంద్.. సుమను ఆటపట్టించారు. 'భర్త ఇంటికి ఆలస్యంగా వస్తే భార్య అలుగుతుంది' అని సుమ చెప్పగ్గానే.. షోలన్నీ పూర్తి చేసుకుని మీరే రోజు ఇంటికి ఆలస్యంగా వెళ్తారు కదా' అంటూ మరోసారి గోపీచంద్.. సుమపై సెటైర్ వేస్తూ నవ్వించారు. ఇక హీరోయిన్ డింపుల్ హయతి గోపీచంద్ పక్కన ఉంటే తెలియకుండానే డ్యాన్స్ చేసేస్తా అంటూ అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. అలాగే సుమ.. రామబాణం మూవీయూనిట్​తో ఓ మనీ గేమ్ కూడా ఆడించింది. అయితే గేమ్ ఆడుతూ సడెన్​గా గోపీచంద్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. వైల్డ్​గా బిహేవ్ చేశారు. ఏకంగా సుమ గొంతునే పట్టుకున్నారు. దీంతో అసలు గోపీచంద్ ఏం చేస్తున్నారో అర్థం కాక అక్కడున్నవారంతా షాక్​కు గురయ్యారు. అయితే గోపీచంద్ సుమ గొంతు ఎందుకు పట్టుకున్నారో క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇదంతా ప్రమోషన్స్​లో భాగంగానే జరుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే! కానీ గొంతు పట్టుకునేలా ఏం ఫన్​ క్రియేట్​ చేశారో తెలియాలంటే.. ఈ నెల 29న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అప్పటివరకు దీనికి సంబంధించిన ప్రొమో చూసేయండి..

ఇకపోతే రామబాణం చిత్రంలో జగపతి బాబు, ఖుష్బూ, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. మికీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్‌ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు అంటున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి భూపతిరాజా కథ అందించగా.. వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'కిసీ కా భాయ్​ కిసీ కీ జాన్' సర్​ప్రైజ్​ కలెక్షన్స్​.. ఫస్ట్​ డే డీలా పడినా.. ఇప్పుడు ఏకంగా..

Last Updated : Apr 24, 2023, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.