ETV Bharat / entertainment

ఎంత పని చేశావ్ హైపర్​ ఆది... స్టేజ్​పైనే ఏడ్చేసిన రష్మి! - శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో

ఓ వైపు షోలతో మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతోంది యాంకర్ రష్మి. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా.. ​ హైపర్​ ఆది చేసిన ఓ పనికి స్టేజ్​పైనే ఏడ్చేసింది. ఆ వీడియోను మీరు చూసేయండి..

rashmi love failure
ఎంత పని చేశావ్ హైపర్​ ఆది... స్టేజ్​పైనే ఏడ్చేసిన రష్మి
author img

By

Published : Feb 7, 2023, 12:48 PM IST

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ వారం ఎపిసోడ్‌ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. 'చెప్పు బుజ్జికన్నా' పేరుతో రానుంది. ఈ షోలో ప్రేమ జంటలు తమ లవర్స్‌కు కానుకలిచ్చారు. లవ్‌ గురు అంటూ రాఘవ నవ్వులు పూయించారు. ఇక హైపర్ ఆది ఎప్పటి లాగే తన పంచ్​లతో అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే రష్మిని తన ప్రేమ గురించి చెప్పాలని కోరాడు. అంతలో గాలోడు అంటూ బ్యాక్​గ్రౌండ్​లో వినిపించగా.. ఆది మాత్రం సిద్ధు అని ఒకటి రాస్తా అంటూ బోర్డు మీద పేరు రాయబోయాడు. దీంతో రష్మి అక్కడే ఎమోషనల్​ అయింది. బాగా ఏడ్చేసింది. మరి ఈ విశేషాలన్నీ చూడాలంటే.. ఫిబ్రవరి 12న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి.

కాగా, గతంలోనూ తన ప్రియుడు మోసం చేయడంతో కుంగిపోయినట్లు తెలిపింది రష్మి. ఆ బాధను తెలుపుతూ విషాద గీతానికి డ్యాన్స్​ చేసి ఆడియెన్స్​ చేత కన్నీళ్లు పెట్టించింది. తాను ప్రేమించిన వాడు మోసం చేయడంతో ఎంతగా తపించిపోయిందో కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇకపోతే 'ఎక్స్ ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లకు హోస్ట్​గా చేస్తోంది యాంకర్​ రష్మి. ప్రస్తుతం పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: RC 15: రూ.15కోట్లతో మరో పాట.. ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.