Siddharth Malhotra Yodha Movie : 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో సినీ తెరంగేట్రం చేసి అమ్మాయిల మనసులు దోచుకున్నారు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. తొలి సినిమాతోనే యూత్‌ను ఆకట్టుకున్న ఈ స్టార్.. ఆ తర్వాత ట్రెండ్‌ను సెట్ చేస్తూ వరుస సినిమాల ఆఫర్లను అందిపుచ్చుకున్నారు. కెరీర్ తొలిరోజుల్లో లవర్ బాయ్ క్యారెక్టర్లు చేసిన సిద్ధార్థ్ ఆ తర్వాత.. యాక్షన్ రోల్స్ చేస్తూ తనలోని ఇంకో యాంగిల్‌ను ప్రేక్షకులను చూపించారు. 'ఏక్ విలన్', 'షెహన్‌షా' లాంటి సినిమాలు సిద్‌కు స్టార్డం తెచ్చిపెట్టాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ముఖ్యంగా 'షెహన్‌షా'లో ఆయన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమాతో కెరీర్ టర్నింగ్ పాయింట్ అందుకున్న సిద్..వరుసగా భారీ చిత్రాల్లో నటించడం ప్రారంభించారు. అయితే ఇటీవలే వచ్చిన 'మిషన్ మజ్ను' మాత్రం తీవ్ర నిరాశపరిచింది. అయితే తాజాగా 'యోధ' అనే సినిమాలో ఆయన కీలక పాత్రలో నటించారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ మునుపెన్నడు లేని యాక్షన్ సీన్స్‌లో నటించనున్నారని టాక్. అయితే ఈ సినిమా విడుదల తేదీపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమా ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడటం గమనార్హం.
తొలుత ఈ సినిమాను ఈ ఏడాది జులై 7 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తేదీని మార్చేసి సెప్టెంబర్ 15కు ఖరారు చేశారు. కానీ అప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల చివరగా ఈ సినిమాను డిసెంబరు 8న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఈసారైనా కచ్చితంగా రిలీజవుతుందేమో అని అనుకుంటే.. ఆ డేట్‌ను కూడా మార్చేసి డిసెంబర్ 15కు ఫిక్స్ చేశారు.
ఇప్పుడు దాన్ని కూడా వాయిదా వేసి 2024 మార్చి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే ధర్మ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో రూపొందుతున్న ఈ సినిమా ఇన్నిసార్లు వాయిదా పడటం సిద్ధార్థ్ అభిమానులు కాస్త నిరాశపరుస్తోంది.
Yodha Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ధర్మ ప్రొడక్షన్స్‌పై కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓజా సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఫారిన్లో పలు లొకేషన్లలో జరుగుతోంది. టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుండగా.. యాక్షన్ క్వీన్ దిశా పఠాని కూడా 'యోధా'లో కీలక పాత్ర పోషిస్తోంది.
-
Gear up for a touchdown full of action & thrill!👊
— Sidharth Malhotra (@SidMalhotra) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Fasten your seatbelts, #Yodha will be landing on 15th March, 2024.#KaranJohar @apoorvamehta18 #ShashankKhaitan @DishPatani #RaashiiKhanna #SagarAmbre #PushkarOjha @PrimeVideoIN @DharmaMovies #MentorDiscipleFilms @Tseries pic.twitter.com/niMBkkuYBX
">Gear up for a touchdown full of action & thrill!👊
— Sidharth Malhotra (@SidMalhotra) November 7, 2023
Fasten your seatbelts, #Yodha will be landing on 15th March, 2024.#KaranJohar @apoorvamehta18 #ShashankKhaitan @DishPatani #RaashiiKhanna #SagarAmbre #PushkarOjha @PrimeVideoIN @DharmaMovies #MentorDiscipleFilms @Tseries pic.twitter.com/niMBkkuYBXGear up for a touchdown full of action & thrill!👊
— Sidharth Malhotra (@SidMalhotra) November 7, 2023
Fasten your seatbelts, #Yodha will be landing on 15th March, 2024.#KaranJohar @apoorvamehta18 #ShashankKhaitan @DishPatani #RaashiiKhanna #SagarAmbre #PushkarOjha @PrimeVideoIN @DharmaMovies #MentorDiscipleFilms @Tseries pic.twitter.com/niMBkkuYBX
మేడ్ ఫర్ ఈచ్ అదర్.. సిద్ధార్థ్- కియారా బ్యూటిఫుల్ ఫొటోషూట్ చూశారా?
హనీమూన్ గురించి కియారా పోస్ట్.. ఆ రాత్రి అద్భుతంగా గడిచిందంటూ..