ETV Bharat / entertainment

'గేమ్​ ఛేంజర్' మూవీకి​ శంకర్ ఫస్ట్​ ఛాయిస్​ 'చరణ్'​ కాదంట.. మరెవరో తెలుసా?

author img

By

Published : Apr 6, 2023, 3:58 PM IST

గేమ్​ ఛేంజర్ సినిమాకు డైరెక్టర్​ శంకర్​ ఎంచుకున్న హీరో.. రామ్​ చరణ్​ కాదంట. మరి శంకర్​ మైండ్​లో ఉన్న ఆ హీరో ఎవరంటే?

Etv shankar-first-choice-for-game-changer-was-not-ram-charan-says-dil-raju
shankar-first-choice-for-game-changer-was-not-ram-charan-says-dil-raju

గ్లోబల్​ స్టార్​ రామ్​ చరణ్, బాలీవుడ్​ బ్యూటీ కియారా అడ్వాణీ జంటగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గేమ్​ ఛేంజర్​'. స్టార్ డైరెక్టర్ శంకర్​ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిత్రీకరణను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్​లో విడుదలవ్వనున్న ఈ సినిమాపై అటు శంకర్ మూవీ లవర్స్​తో పాటు ఇటు రామ్​చరణ్​ ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు గతంలో మూవీ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమా షూట్స్ నుంచి లీకైన పలు ఫొటోలు.. అభిమానులకు మరిన్ని క్లూస్​ ఇస్తూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత దిల్​రాజు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అసలు మొదట్లో ఈ సినిమాను రామ్​చరణ్​తో కాకుండా వేరొక హీరోతో తీయాలని దర్శకుడు అనుకున్నారని తెలిపారు. "దర్శకుడు శంకర్ నాకు సినిమా మొదటి 45 నిమిషాల కథను వినిపించారు. మొదట్లో ఆయన ఈ సినిమాను పవన్​ కల్యాణ్​తో తీద్దామని అనుకున్నారు. ఆ విషయాన్ని నాకు చెప్పారు. కానీ నేను ఈ కథకు రామ్​ చరణ్​ అయితే బాగా సూట్ అవుతాడనిపించి చరణ్​ను తీసుకోమని దర్శకుడికి చెప్పాను. ఆయన కూడా ఒప్పుకోవడంతో ఈ సినిమా అలా మొదలయ్యింది" అని తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

'ఒక్కో పాటకు రూ.12 కోట్లు ఖర్చు'
ఇక 'గేమ్​ ఛేంజర్' సినిమాలో ఒక్కో పాటకు రూ.10-12 కోట్లు ఖర్చు పెట్టామని దిల్​రాజు తెలిపారు. ఐదు పాటలను ఐదు రకాలుగా షూట్ చేశామని అన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్​ 70 శాతం ముగిసిందని ఇక సెప్టెంబర్ కల్లా ఈ మూవీ కంప్లీట్ అవుతుందని స్పష్టం చేశారు. పొలిటికల్ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్​ చరణ్​, కియారా అడ్వాణీతో పాటు అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికిి తమన్​ మ్యూజిక్​ను అందిస్తున్నారు. హైదరాబాద్​లో చార్మినార్​తో పాటు, కర్నూల్​లోని కొండా రెడ్డి బురుజు లాంటి ఫేమస్​ ఏరియాల్లోనూ ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.