ETV Bharat / entertainment

'శాకుంతలం' 3డీ ట్రైలర్​ రిలీజ్​.. దిల్​రాజు అందుకే ఈ సినిమాలో భాగమయ్యారట! - సమంత శాకుంతలం 3 డీ ట్రైలర్​ రిలీజ్​

హీరోయిన్​ సమంత నటించిన 'శాకుంతలం' సినిమా 3డీ ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. మూవీటీమ్​ ప్రత్యేకంగా ట్రైలర్​ లాంఛ్​ ఈవెంట్​ నిర్వహించి దీన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు శాకుంతలం చిత్రాన్ని 3డీలో తీర్చిదిద్దినట్లు తెలిపారు. తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి ఎదిగిన దశలో ఇలాంటి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్​తో కూడిన చిత్రాలు రావడం పరిశ్రమకు మరింత ఊతమిస్తుందన్నారు.

Samantha Sakuntalam 3d trailer released
సమంత 'శాకుంతలం' 3డీ ట్రైలర్​ రిలీజ్​..
author img

By

Published : Mar 28, 2023, 9:30 PM IST

సమంత 'శాకుంతలం' 3డీ ట్రైలర్​ రిలీజ్​..

స్టార్ హీరోయిన్ సమంత నటించిన కొత్త సినిమా 'శాకుంతలం'. దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం ఇది. గుణశేఖర్ కుమార్తె నీలిమా, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. మోహన్‌బాబు, మధుబాల, దేవ్‌ మోహన్‌, గౌతమి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా గ్రాండ్​గా నవంబరు 4న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆడియెన్స్​ ముందు థియేటర్లలో సందడి చేయనుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ అనేక సార్లు పోస్ట్​ పోన్​ అవుతూ వచ్చింది. ఈ సినిమాను త్రీడీలో చూస్తేనే ఎఫెక్టివ్​గా ఉంటుందని చెబుతూ.. ఆ వర్క్​ కోసమే సినిమా ఆలస్యమవుతుందని మూవీటీమ్​ చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ 3డీకు సంబంధించిన వర్క్​ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఏప్రిల్ 14న రిలీజ్​కు సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్​లో జోరు పెంచినా చిత్రబృందం.. తాజాగా 3డీ ట్రైలర్​ను రిలీజ్ చేసింది.

హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో వందలాది మంది అభిమానుల సమక్షంలో శాకుంతలం 3డీ ట్రైలర్​ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు శాకుంతలం చిత్రాన్ని 3డీలో తీర్చిదిద్దినట్లు తెలిపిన దర్శక నిర్మాతలు... తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి ఎదిగిన దశలో ఇలాంటి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన చిత్రాలు రావడం పరిశ్రమకు మరింత ఊతమిస్తుందన్నారు. తప్పకుండా ఏప్రిల్ 14న శాకుంతలం చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రచార చిత్రం చూసిన మీడియా ప్రతినిధులు కూడా సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శకుంతల-దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శకుంతల పాత్రను హీరోయిన్​ సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్‌ మోహన్‌ కనిపంచారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాపై ముందు నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే 'యశోద' చిత్రం తర్వాత సమంత నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల.. ప్రేక్షకుల్లో అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే రిలీజైన పోస్టర్లు కూడా ఆడియెన్స్​ను బాగానే ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రం కోసం రూ.14కోట్ల విలువ చేసే నిజమైన బంగారు, వజ్రాభరణాలు వినియోగించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'నన్ను ఆపగలిగేవాడు అతడే'.. గూస్​బంప్స్​ తెప్పిస్తున్న 'రావణాసుర' ట్రైలర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.