Salaar Second Single : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'సలార్' మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలయ్యేందుకు ఇప్పటికే సన్నాహాలు కూడా జరిగిపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్‌తో హౌస్ ఫుల్‌గా థియేటర్లు నిండిపోయాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సింగిల్ మూవీ లవర్స్‌లో ఉత్సాహాన్ని పెంచగా, తాజాగా 'ప్రతి గాథ'లో అనే రెండో సాంగ్ విడుదలైంది. తొలి సాంగ్ కంటే ఈ సాంగ్ ఇంకాస్త ఎమోషనల్‌గా ఉండటం వల్ల మూవీ లవర్స్ దీనికి బాగా కనెక్ట్ అవుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"ప్రతి గాథలో రాక్షసుడే హింసలు పెడతాడు. అణచవనే పుడతాడు రాజే ఒకడు. శత్రువునే కడతేర్చే పనిలో మన రాజు అంటూ సాగే లిరిక్స్ ప్రతి ఒక్కరి మనసులు హత్తుకుంటోంది. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సాంగ్‌ను కొన్ని లిరిక్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ పాటను చిన్నారుల బృందం అలపించగా కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూరు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
Salaar First Single : ఇటీవలే విడుదలైన 'సూరీడే' అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంది. వరదా, దేవా మధ్య స్నేహ బంధాన్ని తెలియజేసేలా తెరకెక్కిన ఈ సాంగ్‌కు కూడా మ్యూజిక్ లవర్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.
Salaar Movie Cast : ఇక 'సలార్' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రల్లో పృథ్విరాజ్ సుకుమారన్, బాబీ సింహా, జగపతిబాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి, రామచంద్ర రాజు లాంటి స్టార్స్ నటించారు. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
'సలార్' టీమ్‌తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ - ఫుల్ వీడియో రిలీజ్