Raviteja Harish Shankar Movie : 'ఈగల్' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తాజాగా తన ఫ్యాన్స్‌కు ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన అప్కమిందగ్ మూవీకి సంబంధించిన షేర్ చేశారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఓ సినిమాకు ఆయన సైన్ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్ అనౌన్స్ చేశారు.
-
The Magical Mass Combo is back ❤️🔥
— People Media Factory (@peoplemediafcy) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Mass Maharaja @RaviTeja_offl and @harish2you reunite for an entertainer 💥💥
This time, the #MassReunion gets spicier 🔥🔥
Produced by @vishwaprasadtg & @vivekkuchibotla under @peoplemediafcy 💥💥
More details soon! pic.twitter.com/OYNmnRuPDx
">The Magical Mass Combo is back ❤️🔥
— People Media Factory (@peoplemediafcy) December 13, 2023
Mass Maharaja @RaviTeja_offl and @harish2you reunite for an entertainer 💥💥
This time, the #MassReunion gets spicier 🔥🔥
Produced by @vishwaprasadtg & @vivekkuchibotla under @peoplemediafcy 💥💥
More details soon! pic.twitter.com/OYNmnRuPDxThe Magical Mass Combo is back ❤️🔥
— People Media Factory (@peoplemediafcy) December 13, 2023
Mass Maharaja @RaviTeja_offl and @harish2you reunite for an entertainer 💥💥
This time, the #MassReunion gets spicier 🔥🔥
Produced by @vishwaprasadtg & @vivekkuchibotla under @peoplemediafcy 💥💥
More details soon! pic.twitter.com/OYNmnRuPDx
ఓ స్పెషల్ పోస్టర్‌తో ఈ విషయాన్ని తెలియా చేశారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరి కాంబోలో ఇది మూడవ సినిమా. ఇప్పటికే ఈ ఇద్దరూ 'షాక్', 'మిరపకాయ' లాంటి సినిమాలకు కలిసి పని చేశారు. అందులో షాక్ మిక్స్డ్ టాక్ అందుకోగా, 'మిరపకాయ' మాత్రం సూపర్ హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. అంతే కాకుండా రవితేజకు మంచి బ్రేక్ ఇచ్చింది.
మరోవైపు హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతునున్న మరో మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇంతలోనే ఈ మూవీ అనౌన్స్ చేయడం వల్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉస్తాద్‌కు సంబంధించి ప్రస్తుతం ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తైంది. కొన్ని కారణాల వల్ల ప్రస్తతానికి బ్రేక్ పడింది. అయితే ఇప్పట్లో ఉస్తాద్ షూటింగ్ జరిగేలా లేనందున రవితేజ మూవీని పట్టాలెక్కిస్తున్నారా అంటూ ఫ్యాన్స్ నెట్టింట ఆరా తీయడం మొదలెట్టారు.
కానీ ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు. ఏదీ ఏమైనప్పటికీ హరీశ్ శంకర్ త్వరలో అప్డేట్స్ ఇస్తే తప్ప అసలు మ్యాటర్ బయటపడదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికొస్తే.. యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల, సాక్షి వైద్య కథనాయికలుగా నటిస్తున్నారు. పోలీస్ డ్రామాగా సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Ustaad Bhagat Singh Remake : 'పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ రీమేక్?'.. హరీశ్ శంకర్ రిప్లై ఏంటంటే?
Ravi Teja Silpa shetty : మాస్ మహారాజాతో శిల్పాశెట్టి డ్యాన్స్.. స్టెప్పులు అదిరిపోయాయి బాసూ!