ETV Bharat / entertainment

47 ఏళ్ల వయసులో ప్రేయసితో పెళ్లికి రెడీ అయిన బాలీవుడ్ స్టార్- 'అర్జునుడు' వివాహమాడిన చోటే! - రణ్​దీప్ హుడా ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్ వైరల్

Randeep Hooda Wedding : బాలీవుడ్ స్టార్ నటుడు రణ్​దీప్ హుడా 47 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయ్యారు. తన ప్రియురాలిని త్వరలో వివాహం చేసుకోనున్నారు. అయితే మహాభారతంలో అర్జునుడు చిత్రాంగదను పెళ్లి చేసుకున్న చోటే తాను కూడా చేసుకుంటున్నానని సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Randeep Hooda Wedding
Randeep Hooda Wedding
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 7:37 PM IST

Updated : Nov 25, 2023, 8:53 PM IST

Randeep Hooda Wedding : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడా పెళ్లిపీటలెక్కనున్నారు. 47 ఏళ్ల వయసులో తన ప్రియురాలు లిన్‌ లైస్రామ్‌ను మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మేరకు తన పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ రణ్‌దీప్‌ హుడా తాజాగా సోషల్ మీడియా​లో పోస్ట్ పెట్టారు. ఈ నెల 29న తమ వివాహం జరగనుందని వెల్లడించారు.

Randeep Hooda Getting Married : 'మహాభారతంలో అర్జునుడు ఎక్కడ మణిపుర్‌ యువరాణి చిత్రాంగదను వివాహం చేసుకున్నారో.. అక్కడే కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలో మేము ఒక్కటి కాబోతున్నాం. ఈ నెల 29న ఇంఫాల్‌లో మా వివాహం జరగనుంది. త్వరలోనే ముంబయిలో పెళ్లి విందు ఏర్పాటు చేయనున్నాం. మా ప్రయాణానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం' అని ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్​ కాస్త నెట్టింట్లో వైరల్‌గా అవుతోంది.

2001లో రిలీజైన 'మన్‌సూన్‌ వెడ్డింగ్‌'తో తెరంగేట్రం చేశారు రణ్‌దీప్‌ హుడా. 'రిస్క్‌', 'కర్మ ఔర్‌ హోలీ', 'కాక్‌టైల్‌', 'జిస్మ్‌ 2', 'బాంబే టాకీస్‌', 'కిక్‌', 'భాగి 2', 'రాధే' వంటి సినిమాల్లో రణ్​బీర్ నటించారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం 'స్వతంత్ర వీర్​ సావర్కర్' చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా స్వాతంత్య్ర పోరాట యోధుడు వినాయక్ దామోదర్​ సావర్కర్ బయోపిక్​గా రూపొందుతోంది. ఈ సినిమాతోనే రణ్​దీప్​ హుడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వహించారు. ఉత్కర్ష్​ నైథానితో కలిసి ఈ సినిమాకు కో రైటర్​గానూ వ్యవహరించారు.

మరోవైపు 37 ఏళ్ల ఆయన ప్రేయసి లిన్ లైస్రామ్​ మోడలింగ్​తో పాటు నటన, వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. లిన్ ఇప్పటివరకు 'మేరీకోమ్', 'రంగూన్', 'జానే జాన్', 'ఖైది బ్యాండ్', 'అక్సోన్', వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 2007లో విడుదలైన 'ఓం శాంతి ఓం' చిత్రంలో చిన్న కామియో రోల్​ చేసి సినిమాల్లోకి బాలీవుడ్​లో అరంగేట్రం చేశారు. కాగా రణ్​దీప్​, లిన్​ ఎంతో కాలం నుంచి సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నారు. రణ్‌దీప్‌ వయసు 47 ఏళ్లు కాగా.. ఆయన కంటే లిన్‌ పదేళ్లు చిన్నది.

'కాంతార- చాప్టర్​1'​ బిగ్ అప్డేట్​- ఫస్ట్​లుక్ రిలీజ్ అప్పుడే!

ఆ ఒక్క ఫొటోతో బాలీవుడ్​లో సందీప్​ రెడ్డి మేజిక్.. సీక్రెట్ చెప్పేసిన బాబీ!

Last Updated : Nov 25, 2023, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.