Ranbir kapoor surprises Aliabhatt: తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్‌ను.. హీరో రణ్‌బీర్‌కపూర్ సర్‌ప్రైజ్ చేశారు. 'హార్ట్ ఆఫ్ స్టోన్' షూట్ ముగించుకుని శనివారం రాత్రి ముంబయికి వచ్చిన ఆమె కోసం రణ్‌బీర్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇలా రావడంతో ఆలియా ఒక్కసారిగా ఆనందానికి లోనయ్యారు. 'బేబీ' అని పిలుస్తూ ఆయన్ని హత్తుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న రణ్‌బీర్‌కపూర్-ఆలియాభట్ ఈ ఏడాదిలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తాము త్వరలో తల్లిదండ్రులు కానున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో ఆలియా తన తదుపరి ప్రాజెక్ట్స్‌ని వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో వరుస షూట్స్‌లో పాల్గొంటున్నారు. అలా, ఆలియా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న తొలి చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్' షూట్ నిమిత్తం కొన్నిరోజులుగా ఆమె యూరప్‌లోనే ఉన్నారు. ఈక్రమంలోనే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ముంబయికి తిరిగి వచ్చారు. ఆ సమయంలోనే రణ్‌బీర్.. ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. మరోవైపు రణ్‌బీర్ సైతం తన తదుపరి సినిమా 'షంషేరా', 'బ్రహ్మాస్త్రం' ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. త్వరలోనే ఇవి విడుదల కానున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: టీజర్‌తో అదరగొట్టేసిన కిరణ్ అబ్బవరం.. ఫన్నీగా 'మై డియర్ భూతం' ట్రైలర్