ETV Bharat / entertainment

రామ్​పోతినేని-గౌతమ్​ మేనన్​.. కన్ఫామ్​ అవుతుందా? - రామ్​ పోతినేని గౌతమ్​ మీనన్​ మూవీ

Rampotineni Gowtham menon movie: మరో కొత్త కలయికకి రంగం సిద్ధమైందా? రామ్‌ పోతినేని - గౌతమ్‌ మేనన్‌ జట్టు కట్టనున్నారా? ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు మొదలయ్యాయా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. మరోవైపు రామ్​.. హరీశ్​శంకర్​తోనూ మూవీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఏది ఓకే అవుతుందో చూడాలి.

Rampotineni Gowtham menon
రామ్​పోతినేని-గౌతమ్​ మేనన్​
author img

By

Published : Jun 30, 2022, 7:05 AM IST

Rampotineni Gowtham menon movie: టాలీవుడ్ హీరో రామ్​పోతినేని.. కెరీర్​లో వరుస ప్రాజెక్ట్​లను ఓకే చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త చిత్రానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. రామ్‌ ఇటీవలే లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్‌' చిత్రాన్ని పూర్తి చేశారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఆ చిత్రం జులైలోనే విడుదల కానుంది. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకి కొబ్బరికాయ కొట్టారు.

ఇప్పుడు మరో కొత్త సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రేమకథలైనా సరే, యాక్షన్‌ కథలకైనా రెడీ అన్నట్టుగా కనిపించే రామ్‌ కోసం గౌతమ్‌ మేనన్‌ ఓ కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొంతకాలంగా కథా చర్చలు జరుగుతున్నాయి. మేకింగ్‌లో ప్రత్యేకమైన శైలి ఉన్న గౌతమ్‌ మేనన్‌.. రామ్‌తో జట్టు కట్టనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక రామ్.. దర్శకుడు హరీశ్​శంకర్​తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ ఈ రెండు ప్రాజెక్ట్​లు ఓకే అయితే ఏది ముందు సెట్స్​పైకి వెళ్తుందో చూడాలి.

ఇదీ చూడండి: మిస్​ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్​.. కారణమిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.