250 Crore Pre Release Business Movie : ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఎన్నో సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. అందులో కంటెంట్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్నవి కొన్నైతే.. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించినవి మరికొన్ని. షారుఖ్ ఖాన్ 'పఠాన్', 'జవాన్', రజనీకాంత్ 'జైలర్' సన్నీ దేవోల్ 'గదర్ 2'.. ఇలా పలు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 3400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డుకెక్కాయి. దీంతో రానున్న సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అగ్ర తారలు కుడా తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక సినిమాలు అంటేనే హిట్ టాక్‌తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారు. ఈ క్రమంలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా 'డుంకీ', 'సలార్', 'లియో', 'యానిమల్' లాంటి సినిమాలు మరి కొద్ది నెలల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీగా ఉన్నాయి.
అయితే ఈ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్‌లతో పాటు థియేట్రికల్ బిజినెస్ కోట్లలో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసేందే. సినిమా రిలీజ్ కంటే ముందు జరిగే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కూడా ప్రొడ్యూసర్లకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో ఓ సినిమా రిలీజ్ కాకముందే రికార్డు స్థాయిలో వసుళ్లను సాధించిందట. అదే రామ్ చరణ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్'.
సినీ వర్గాల సమాచారం ప్రకారం 'గేమ్ ఛేంజర్' సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ 5 ' సొంతం చేసుకుందట. అందులో భాగంగా రూ. 250 కోట్లు సంపాదించిందని సమాచారం. దీంతో ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే భారీ మొత్తంలో వసూళ్లను అందుకుందట. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Game Changer Movie Cast : ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Shankar Indian 2 Movie Update : కమల్ మూవీపై దర్శకుడి క్లారిటీ.. మరి 'గేమ్ ఛేంజర్' సంగతేంటి?
Dil Raju Game Changer Movie Update : అదేంటి.. ఆ విషయం దిల్ రాజుకు కూడా తెలియదా?