ETV Bharat / entertainment

Rajnikanth Jailer Shows : 'జైలర్'.. ఆ విషయంలో 'కేజీయఫ్‌'​, 'అవతార్'​నే దాటేసిందిగా.. - రజనీ జైలర్​ మూవీ రిలీజ్

Rajnikanth Jailer Shows : సూపర్ స్టార్ రజనీకాంత్​ లీడ్​ రోల్​లో రూపొందిన 'జైలర్' సినిమా ఆగస్ట్​10న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే 'కేజీయఫ్‌-2', 'అవతార్​-2' లాంటి సినిమాలను దాటి ఓ నయా రికార్డును సెట్​ చేసింది. ఇంతకీ అదేంటంటే..

Rajnikanth Jailer
Rajnikanth Jailer
author img

By

Published : Aug 8, 2023, 10:15 AM IST

Updated : Aug 8, 2023, 1:00 PM IST

Rajnikanth Jailer Shows : కోలీవుడ్​ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో 'జైలర్'​గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​ రూపొందించిన ఈ సినిమా ఆగస్ట్​ 10న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే రిలీజ్ కాకుండానే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. థియేట్రికల్ ట్రైలర్ చూసిస ఫ్యాన్స్​ ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూస్తామంటూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 'జైలర్'​ కోసం చెన్నై, బెంగళూరులో ఉన్న పలు ఆఫీసులకు సెలవులు సైతం ప్రకటించగా..ఓ కంపెనీ ఏకంగా తమ ఉద్యోగులకు ఉచితందా సినిమా టిక్కెట్లను పంపిణీ చేసిందట.

Jailer Movie Bengaluru Shows : ఇక అడ్వాన్స్​ బుకింగ్స్​ సైతం ఓ రేంజ్​లో జరుగుతున్న తరుణంలో 'జైలర్'​ సినిమా ఓ అరుదైన రికార్డును తన పేరిట రాసుకుంది. బెంగుళూరులో తొలిరోజు 1090కి పైగా షోలు వేయనున్న సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటి వరకు 'కేజీయఫ్​-2' (1037 షోలు)తో పాటు 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (1014 షోలు) పేరిట ఉన్న రికార్డులను రజనీకాంత్ 'జైలర్' అధిగమించింది. దీని బట్టి అక్కడ రజనీ క్రేజ్​ ఎంత ఉందో అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Jailer Movie Cast : ఇక 'జైలర్' సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమాలో రజనీకాంత్‌ సరసన రమ్యకృష్ణ నటించగా..తమన్నా భాటియా, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్, సునీల్, మిర్నా మీనన్, యోగి బాబు లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాకు నిర్మణ బాధ్యతలు చేపట్టింది.

ఆకట్టుకున్న ట్రైలర్​..
Rajnikanth Jailer Trailer : తాజాగా విడుదలైన ట్రైలర్​ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పటిలాగే రజనీకాంత్ తన మార్క్​ స్టైల్, స్వాగ్​, ఎనర్జీతో అదిరిపోయేలా కనిపించారు. ఆయన డైలాగ్స్​ కూడా అదిరిపోయాయి. "ఈ వ్యాధి వచ్చిన వారు పిల్లిలా ఉంటారు. కానీ ఒక్కసారి దడేల్‍గా పులిలా మారుతారు"అంటూ బ్యాక్​గ్రౌండ్​లో రజినీని ఉద్దేశిస్తూ వచ్చిన డైలాగ్ బాగుంది. తన పోలీస్ కొడుకు, స్కూలు మనవడు షూ పాలీష్ చేస్తూ మొదట కనిపించిన రజనీ.. ఆ తర్వాత దడేల్​ పులిలా మారుతారంటూ యాక్షన్ మోడ్‍లోకి వెళ్లిపోయారు.

"ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే" అంటూ రజినీకాంత్ చెప్పిన డైలాగ్ ట్రైలర్​కే హైలైట్​గా నిలిచింది. ఆ తర్వాత సూపర్ స్టైలిష్​గా యాక్షన్ సీన్లలో కనిపించి ప్రేక్షకులకు గూస్​బంప్స్​ తెప్పించారు. కొంతమంది దీన్ని చూసి వింటేజ్ రజినీ కనిపించారంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అనిరుధ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఫైనల్​గా 'టైగర్‌గా హుకుం' అంటూ రజినీ డైలాగ్‍తో షోకేస్ ట్రైలర్​ను ముగించారు మేకర్స్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'జైలర్‌' రిలీజ్‌.. చెన్నై, బెంగళూరు ఆఫీస్​లకు హాలీడే.. ఫ్రీగా టికెట్లు.. ఇది కదా రజనీ క్రేజ్‌ అంటే!

రజనీని కాదని తమన్నాను ఎందుకో?

Last Updated : Aug 8, 2023, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.