'కాంతార'... సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ దిగ్గజాల వరకూ అందరి నోట వినబడుతున్న మాట. అంతలా ఈ కన్నడ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. రిషభ్ శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. తాజాగా ఈ సినిమాని చూసిన రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. "తెలిసింది తక్కువ..తెలియనిది ఎక్కువ...ఈ విషయాన్ని సినిమాల్లో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు'అని 'కాంతార' చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ను ఆయన కొనియాడారు.
"కాంతార సినిమా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇండియన్ సినిమాలోనే ఇదొక మాస్టర్ పీస్. రచయిత, దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి ప్రతిభకు హ్యాట్సాఫ్" అని ట్వీట్ చేశారు రజనీకాంత్. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం పలు భారతీయ భాషల్లోకి అనువాదమై అన్నిచోట్లా భారీ వసూళ్లు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.200కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">