ETV Bharat / entertainment

కార్లు పైకిలేస్తే థియేటర్లకు జనాలు రారంటున్న బండ్ల గణేష్, వారికి స్ట్రాంగ్​ కౌంటర్​ - bandla ganesh twitter video bandla ganesh

మంచి కథనంతో సినిమాలు తెరకెక్కిస్తే తెలుగు ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​ అన్నారు. ఓటీటీలకు అలవాటు పడి ప్రజలు థియేటర్లకు రావడం లేదంటున్న వారికి ఆయన స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చారు. సోషల్​ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసి పలు సూచనలు కూడా చేశారు.

producer bandla ganesh
producer bandla ganesh
author img

By

Published : Aug 14, 2022, 3:11 PM IST

Updated : Aug 14, 2022, 3:55 PM IST

కార్లు పైకిలేస్తే థియేటర్లకు జనాలు రారంటున్న బండ్ల గణేష్, వారికి స్ట్రాంగ్​ కౌంటర్​

Bandla Ganesh: సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని గత కొద్దిరోజులుగా సినీ పెద్దలు, నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఓటీటీలకు ప్రజలు అలవాటు పడిపోవడం వల్ల మూవీ కలెక్షన్స్ తగ్గిపోతున్నాయని అంటున్నారు. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకునేందుకు సినిమా షూటింగ్​లను సైతం నిలిపివేశారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

"సినిమా.. సినిమా.. నా జీవితం సినిమా.. నాకు ఇష్టమైన పదం సినిమా. నేను సినిమా కోసమే బతుకుతున్నా. ఈ మధ్య సినిమాలు ఆడటం లేదు. జనాలు థియేటర్స్‌కు రావడం లేదని చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. వేరే భాష హీరో వచ్చి ఇక్కడ సూపర్ హిట్ కొట్టాడు. అలాగే మన హీరోలు నందమూరి కల్యాణ్ రామ్, నిఖిల్ తీసిన సినిమాలు సూపర్ హిట్​ అయ్యాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మంచి కథనంతో అద్భుతంగా సినిమా తెరకెక్కిస్తే.. ఎప్పుడైనా, ఏ కాలమైనా అలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.. ఆనందిస్తారు.. ఆస్వాదిస్తారు."

-- బండ్ల గణేశ్​, ప్రముఖ నిర్మాత

"మనం బడ్జెట్లు పెంచుకుని వేల కోట్ల రూపాయలతో సినిమాలు తీసి.. వంద కార్లు ఎగిరాయి.. వంద టైర్లు ఎగిరాయి.. చేతిలో హీరో ఓ రాడ్ పట్టుకుని వెనుక ఓ వంద మందిని పెట్టుకుని భమ్ అని పైకిలేపితే జనాలు వస్తారునుకోవడం తప్పు. గుండెకు హత్తుకునే.. జనాలు కుర్చోబెట్టగలిగే సినిమాలు తీసినంత కాలం మనకు అపజయం లేదు. ఈ బంద్‌లు, రేట్లు తగ్గించుకోవడం వంటివి కాకుండా మంచి సినిమా తీయడంపై దృష్టి పెడదాం. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు.. ఆశీర్వదిస్తారు." అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి: నిఖిల్​ కార్తికేయ 2 సినిమాకు మంచి వసూళ్లు, తొలిరోజే 25 శాతం రికవరీ

లైట్ గడ్డంతో మహేశ్ బాబు కొత్త లుక్ అదుర్స్

Last Updated : Aug 14, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.