Pranay Reddy Vanga Latest Interview : 'యానిమల్' మూవీని సెన్సేషన్‌గా తీర్చిదిద్దిన వాళ్లలో సందీప్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. అయితే ఆ సినిమా రిలీజ్ నుంచి ఇప్పటి వరకు ఆ ఇద్దరూ అనేక ఇంటర్వ్యూల్లో తమ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రణయ్ తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
"అర్జున్ రెడ్డి సినిమా విషయంలో మేమిద్దరం చాలా రిస్క్ తీసుకున్నాం. మనం ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరు ఇస్తారని నేను అనుకున్నాను. ఒక వేళ ఈ మూవీ హిట్ కాకపోతే మేము రూ.50 లక్షలు లేకుంటే కోటి రూపాయలు నష్టపోతామని అనుకున్నాం. రెండు, మూడు ఏళ్లలో మళ్లీ సెట్ బ్యాక్ అవ్వచ్చని అనుకున్నాం. కానీ, మా శ్రమ ఫలించింది. 'అర్జున్ రెడ్డి' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను సాధించింది. ఇక హిందీలో విడుదలైన 'కబీర్ సింగ్'కు కుడా విశేషాదరణ లభించింది. ఈ సినిమా కోసం సందీప్ చాలా కష్టపడి స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఒకవేళ ఆ సినిమా సక్సెస్ అవ్వకుంటే తను సినిమాలు మానేసి మా బిజినెస్ చూసుకునే వాడని అనుకుంటున్నాను. కానీ, తనకు చాలా నమ్మకుం ఉంది. తన నమ్మకమే 'అర్జున్ రెడ్డి'ని సూపర్ హిట్‌గా నిలబెట్టింది" అన్నారు.
మరోవైపు తన సినిమాల విషయంలో సందీప్ ఎక్కడా కాంప్రమైజ్ కాడని చెప్పారు ప్రణయ్. సినిమాలోని క్యారెక్టర్ల ఎంపికలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని, ఆ విషయంలో కరెక్ట్ ఉంటే ఇక సగం సినిమా అయిపోయినట్టే అని తను భావిస్తాడని చెప్పారు. "డేట్స్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఉన్నారు. వారందరినీ తన సినిమాలో తీసుకోవాలని అనుకోడు సందీప్. తన స్టోరీకి కచ్చితంగా ఎవరు సరిపోతారో వారినే ఎంచుకుంటాడు. తన పని విషయంలోనూ అంతే. స్టార్ల విషయంలో నేను సలహాలు ఇస్తాను. కానీ, ఫైనల్ నిర్ణయం మాత్రం సందీప్‌దే. 'అర్జున్ రెడ్డి' తర్వాత నేను నాలుగు ఏళ్లు అమెరికాలో పని చేశాను. 2021లో అక్కడ పని మానేశాను. 'అర్జున్ రెడ్డి' సినిమాతో సందీప్‌ను డైరెక్టర్‌గా నేను పరిచయం చేశాను. ఇక 'యానిమల్' సినిమాతో సందీప్ నన్ను ప్రొడ్యూసర్‌గా పరిచయం చేశాడు. ప్రస్తుతానికి నా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టి సినిమాల్లోకి వచ్చేశాను" అంటూ మరిన్ని విశేషాలను ప్రణయ్ చెప్పుకొచ్చారు.
ఒక్క దెబ్బతో అన్నయ్య లైఫ్ సెట్ చేసిన సందీప్- అప్పుడు 32ఎకరాలు అమ్మేసినా!