ETV Bharat / entertainment

పవన్​ కల్యాణ్-సుజిత్ కాంబోపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​.. పోస్టర్​తోనే 'పవర్​'ఫుల్ మెసేజ్​.. - పవన్ కల్యాణ్ సినిమాపై ప్రభాస్ కామెంట్స్​

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్‌ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ కాంబోపై ప్రభాస్ స్పందించారు. అలానే తాజాగా విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్​ను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో చాలా విషయాలు దాగున్నాయనే విషయం అర్థమౌతుంది. ఇంతకీ ఆ పోస్టర్‌లో ఏమున్నాయో తెలుసా?

pawan kalyan new movie poster
పవన్​ కల్యాణ్-సుజిత్ కాంబోపై ప్రభాస్ కామెంట్స్​.. పోస్టర్​తోనే 'పవర్​'ఫుల్ మెసేజ్​..
author img

By

Published : Dec 4, 2022, 4:29 PM IST

Updated : Dec 5, 2022, 10:01 AM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, దర్శకుడు సుజిత్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్నట్లు తాజాగా చత్ర బృందం ప్రకటించింది. ఓ కాన్సెప్ట్‌ పోస్టర్‌ సైతం విడుదలైంది. అయితే ఈ పోస్టర్‌ను ఆసక్తిగా తిలకిస్తే ఇందులో సినిమాకు సంబంధించిన పలు విషయాలను దర్శకుడు పొందుపరిచినట్లు అర్థమవుతుంది. ఇప్పుడు పవర్‌స్టార్‌ అభిమానులందరూ ఆ పోస్టర్‌లో దాగి ఉన్న విశేషాలను డీ కోడ్‌ చేసే పనిలో పడ్డారు. ఇంతకీ ఆ పోస్టర్‌ ఏం చెబుతుందో ఓ లుక్కేద్దాం..

pawan kalyan new movie poster
పవన్​ కల్యాణ్​ కొత్త సినిమా పోస్టర్

ఆ పోస్టర్‌ను ఒక్కసారి చెక్‌ చేస్తే..

  • They Call Him #OG.. ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌. వాళ్లందరూ ఆయన్ని ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అని పిలుస్తుంటారని ఈ ట్యాగ్‌ లైన్‌ చెబుతోంది.
  • పోస్టర్‌లో పవన్‌కల్యాణ్‌ ఫొటోపై రాసి ఉన్న భాష.. జపానీస్‌. 'FirestormIsComing' (అగ్నితుపాను వస్తోంది) అని దాని అర్థం.
  • పవన్‌కల్యాణ్‌ నీడలో గన్‌ కనిపిస్తుంది.
  • పవన్‌కల్యాణ్‌ ముందు ఉన్న వృత్తాకారం.. జపాన్‌ జాతీయ జెండాను గుర్తు చేస్తుంది.
  • పోస్టర్‌లో ఓ వైపు విగ్రహం ఆకారం కనిపిస్తుంది. అది జపాన్‌లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం. ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో ఉంది.
  • ఇక, పోస్టర్‌లో మరోవైపు చూస్తే మనదేశంలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా కనిపిస్తుంది.

పైన చెప్పిన వాటిని ఆధారంగా చూస్తే ఈ సినిమాలో పవర్‌స్టార్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతోంది. జపాన్‌, ముంబయి నేపథ్యంలో ఈ కథ సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈసినిమా కోసం సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌ వెచ్చించే అవకాశం ఉందని సమాచారం.

వైరల్‌గా మారిన సుజిత్‌ వీడియో..
పవన్‌-సుజిత్‌ కాంబోలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సినిమా ప్రకటించడంతో సోషల్‌మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అయిన సుజిత్‌ 'గబ్బర్‌సింగ్‌' రిలీజ్‌ అయినప్పుడు 'పవర్‌స్టార్‌ జిందాబాద్‌' అని అరుస్తూ థియేటర్‌ నుంచి బయటకు వస్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన పవన్‌ అభిమానులు.. "అన్నా సినిమా అదిరిపోవాలి" అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రభాస్​ కంగ్రాట్స్​.. ఇక ఈ సినిమాపై రెబల్​ స్టార్ ప్రభాస్​ స్పందించారు. మూవీటీమ్​కు అభినందనలు తెలిపారు. సుజిత్​-పవన్ కాంబో సంచలనం సృష్టిస్తుందని అన్నారు. అయితే అంతకముందు గతంలో సుజిత్​తో కలిసి సాహో చిత్రానికి పనిచేశారు ప్రభాస్​. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను అందుకుంది. ​

ఇవీ చదవండి : పవన్ కల్యాణ్ కొత్త మూవీ వారెవ్వా సుజీత్

'రతన్​ టాటా బయోపిక్'పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఏమన్నారంటే!

Last Updated : Dec 5, 2022, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.