ETV Bharat / entertainment

మహేశ్​ టు పవన్​.. ఆ విషయంలో ప్రభాస్​ ఒక్కడే పర్​ఫెక్ట్​ - హరిహరవీరమల్లు పోస్ట్​ పోన్​

ప్రస్తుతం టాలీవుడ్​లో​ పలువురు స్టార్ హీరోలు.. తమ కొత్త చిత్రాలతో ఫుల్​ బిజీగా ఉంటున్నారు. అయితే ఆ విషయంలో స్టార్​ హీరోలందరిలో ప్రభాస్ ఒక్కడే పర్​ఫెక్ట్​. ఇంతకీ ఏంటంటే?

pawan to mahesh delaying projects only prabhas is perfect
మహేశ్​ టు పవన్​.. ప్రభాస్​ ఒక్కడే పర్​ఫెక్ట్​!
author img

By

Published : Jul 11, 2023, 2:06 PM IST

Tollywood upcoming movies : చిత్రసీమలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆడియెన్స్​ అభిరుచికి తగ్గట్టు సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. స్మాల్ స్కేల్ సినిమాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరకు అన్ని కంటెంట్​, టెక్నికల్​ పరంగా హై క్వాలిటీ స్టాండర్డ్స్​ మెయిన్​టెయిన్​ చేస్తున్నారు. ఎందులోనూ రాజీపడట్లేదు. కాస్త ఆలస్యమైనా.. ఔట్​ పుట్ అనుకున్న విధంగా​​ పర్​ఫెక్ట్​గా ఉందని అనిపిస్తేనే వాటిని థియేటర్లలోకి రిలీజ్​ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో తమ అభిమాన హీరో సినిమా కోసం.. అభిమానులు ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్​లో​ పలువురు స్టార్ హీరోలు నటిస్తున్న కొన్ని బడా సినిమాల రిలీజ్​ విషయంలో జాప్యం కొనసాగుతోంది. సినిమా అనౌన్స్​మెంట్​తో పాటు విడుదల తేదీ ప్రకటించి చాలా కాలమైనా.. ఇంకా షూటింగ్​ అంటూ కాలాన్ని వెల్లదీస్తూనే ఉన్నాయి. వీటిలో మొదటిది పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్​ నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్​ 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రం 2020 సెప్టెంబరులో ప్రకటించారు. చిత్రీకరణ కొన్ని రోజులు సాగింది. కానీ ఇప్పుడు దీని షూటింగ్​ గురించి ఎటువంటి అప్డేట్​ లేదు. ప్రస్తుతం పవన్ తన ఇతర చిత్రాలతో పాటు పాలిటిక్స్​లో ఫుల్​ బిజీ అయిపోయారు. కాబట్టి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది చెప్పడం కష్టమే. అయితే ఇదే సమయంలో 2020 డిసెంబరులో ప్రభాస్ సలార్ ప్రకటించారు. ఇప్పుడీ చిత్రం మాత్రం ఈ ఏడాది సెప్టెంబరు 28న రిలీజ్​కు రెడీ అయింది.

రామ్​చరణ్​-శంకర్ గేమ్​ ఛేంజర్​ ఫిబ్రవరి 2021లో అనౌన్స్​ చేశారు. ఇంకా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. రిలీజ్​డేట్​పై క్లారిటీ లేదు. వచ్చే ఏడాది సమ్మర్​లో రిలీజ్​ చేస్తామని అంటున్నారు. 2021 ఏప్రిల్​లో కొరటాల-ఎన్టీఆర్ కలిసి NTR 30​ 'దేవర' అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ఎన్నో నెలల పాటు షూటింగ్​ను ప్రారంభించుకోలేదు. ఇప్పుడు మాత్రం వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 4న సినిమా థియేటర్లలోకి వస్తుంది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్​ 2021 మేలో అనౌన్స్​ చేశారు. అప్డేట్స్​ కూడా ఇస్తున్నారు. కానీ రిలీజ్ డేట్ చెప్పలేదు. ఈ ఏడాది డిసెంబరులో అని సమాచారం.

మహేశ్​ బాబు గుంటూరు కారంకు మొదటి నుంచి అన్నీ అడ్డంకులే ఎదురౌతున్నాయి. షూటింగ్​ పోస్ట్​పోన్​, నటీనటల ఎంపికలో ఆలస్యం, కథలో మార్పులు.. ఇలా పలు రకరకాల కారణాల వల్ల షూటింగ్ ఎంతవరకు వచ్చిందో తెలీదు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. కానీ డౌటే. మొత్తంగా చూస్తే.. దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించిన ఈ సినిమాలన్నీ ఇంకా రిలీజ్​కు రెడీ అవ్వలేకపోయాయి. ఒక్క సలార్​ మాత్రమే చెప్పిన టైమ్​కు రెడీ అయిపోయింది.

ఇదీ చూడండి :

'డబుల్​ ఇస్మార్ట్' వరల్డ్​లోకి రామ్​ ఎంటర్​.. ఫుల్ లుక్ ఛేంజ్​!

Vaishnavi Chaitanya latest photos : 'బేబీ' బ్యూటీ అందాల రాకుమారి.. ఈ విషయాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.