Bro Day 2 Collections : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. భారీ అంచనాల నడుమ జులై 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీకెండ్ ట్రీట్‌గా సందడి చేస్తున్న ఈ సినిమా.. రిలీజైన అన్ని థియేటర్లలో మంచి రెన్పాన్స్ అందుకుంటోంది. హౌస్‌ఫుల్ బోర్డులతో సందడి చేస్తోంది. పవన్ వింటేజ్ టచ్‌తో పాటు.. తేజ్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవడం వల్ల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తొలి రోజు సజావుగా సాగిన కలెక్షన్స్.. రెండో రోజు కాస్త మోస్తరుగా సాగినట్లు అనిపిస్తోంది.
Bro Movie Box Office Collection : తొలి రోజు ఈ సినిమా సుమారు రూ.30 కోట్ల వరకు వసూళ్లను అందుకోగా.. రెండో రోజు సుమారు రూ. 22 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో ఫస్ట్‌డే కన్నా సెకెండ్ డే కలెక్షన్స్ కాస్త డీలా పడ్డట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ కలుపుకుని రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంది. అయితే వీకెండ్ అవ్వడం వల్ల ఆదివారం ఈ సినిమా కలెక్షన్సు మరింత వేగం పుంజుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
Bro Movie Cast : ఇక బ్రో సినిమా విషయానికి వస్తే.. పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే ఇక అభిమానులకు పండగనే చెప్పాలి. ఇప్పటి వరకు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పవన్.. తాజాగా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి 'బ్రో' సినిమాలో నటించారు. తమిళ దర్శకుడు సముద్రఖని రూపొందించిన 'వినోదయసిత్తం'కు రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందించారు. ఇక తమన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగితాన్ని అందించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, వెన్నెల కిశోర్,రోహిణి, అలి రెజా, బ్రహ్మానందం లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వింటేజ్ పవన్ హైలైట్..
Vinatage Pawan in Bro Movie : ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వింటేజ్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్‌తో అదరగొట్టిన పవన్ అప్పుడప్పుడు తన పాత మూవీస్‌ను గుర్తు చేస్తూ సందడి చేశారు. 'గుడుంబా శంకర్' సినిమాలోని 'కిల్లి కిల్లి' సాంగ్‌తో పాటు తమ్ముడు సినిమాలోని 'వయ్యారి భామ', 'ఏదోలా ఉందీవేళ', అలాగే జల్సా సినిమాలోని 'సరిగమ పదనిస' వంటి హిట్ పాటలను మిక్స్ చేసి ఈ సినిమాలోని పలు సీన్స్‌కు యాడ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సైతం అవి వచ్చినప్పుడల్లా ఈలలు, అరుపులతో థియేటర్లను షేక్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">