ETV Bharat / entertainment

'భవదీయుడు భగత్‌సింగ్‌' అప్డేట్​.. ఆ గాయని పెళ్లిలో ఉపాసన సందడి - పవన్​కల్యాణ్ హరీశ్​ శంకర్​ సినిమా

Pawan kalyan Harishshankar movie update: 'భవదీయుడు భగత్‌సింగ్‌' సినిమా సెట్స్​పై ఎప్పుడు వెళ్లనుందో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు హరీశ్ శంకర్. మరోవైపు గాయని కనికాకపూర్‌ పెళ్లిలో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పాల్గొని సందడి చేశారు.

pawan harishshankar movie update
భవదీయుడు భగత్‌సింగ్‌
author img

By

Published : May 21, 2022, 11:39 AM IST

Pawan kalyan Harishshankar movie update: 'గబ్బర్‌సింగ్‌'తో బాక్సాఫీస్‌ని ఊపేసిన కలయిక పవన్‌కల్యాణ్‌-హరీష్‌శంకర్‌లది. ఆ ఇద్దరూ కలిసి చేయబోతున్న సినిమా 'భవదీయుడు భగత్‌సింగ్‌'. ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ చిత్రం కోసం, అప్డేట్స్​ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై మాట్లాడారు దర్శకుడు హరీశ్​ శంకర్​.

"భవదీయుడు భగత్​సింగ్​ ఓ ఇంట్రెస్టింగ్​ సినిమాగా నిలుస్తుంది. ఈ మూవీలో పవన్​ డైలాగ్స్​ ప్రత్యేకంగా నిలుస్తాయి. అవి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక ఆయన చార్మింగ్ ​లుక్​లో కనిపిస్తారు. మొత్తంగా సినిమాను బాగా ఆస్వాదిస్తారు. ఆగస్టులో సినిమా సెట్స్​పైకి వెళ్తుంది." అని అన్నారు. కాగా, ఈ మూవీని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చగా.. చోటా కె ప్రసాద్‌-కూర్పు, రామ్‌ లక్ష్మణ్‌-పోరాటాలు, అయనాంక బోస్‌-ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు పవన్​ ప్రస్తుతం క్రిష్​ దర్శకత్వంలో 'హరిహరవీరమల్లు' మూవీలో నటిస్తున్నారు.

Kanikakapoor marriage: ప్రైవేటు ఆల్బమ్స్‌, పలు బాలీవుడ్‌ చిత్రాలకు పాటలు పాడి గాయనిగా బీటౌన్‌లో ఫేమ్‌ సొంతం చేసుకున్నారు కనికాకపూర్‌. తాజాగా ఆమె రెండో వివాహం చేసుకున్నారు. లండన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో లండన్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో హిందూ సంప్రదాయంలో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో రామ్‌చరణ్‌ సతీమణి, కనిక స్నేహితురాలు ఉపాసన పాల్గొని సందడి చేశారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉప్సీ నెట్టింట షేర్‌ చేశారు.

లఖ్‌నవూకు చెందిన కనిక లండన్‌కు చెందిన రాజ్‌ అనే వ్యాపారవేత్తను 1988లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె విదేశాల్లోనే సెటిలయ్యారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. అయితే.. మనస్పర్థలు తలెత్తడంతో 2012లో కనిక-రాజ్‌ విడిపోయారు. ఆ తర్వాత ఆమె కెరీర్‌పై దృష్టి పెట్టి, వరుస ఆల్బమ్స్‌ రిలీజ్‌ చేసి మంచి సక్సెస్‌ అందుకున్నారు. 'రాగిణి ఎంఎంఎస్‌' సినిమాలోని 'బేబీ డాల్‌', 'చిట్టియాన్‌ కలైయాన్‌' ఇలాంటి సూపర్‌హిట్ సాంగ్స్‌ని ఆలపించారు. ఇటీవల, అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమాలోని 'ఊ అంటావా ఊఊ అంటావా' హిందీ వెర్షన్‌ని కనికానే పాడారు.

upasana kanikakapoor marriage
కనికాకపూర్​
upasana kanikakapoor marriage
పెళ్లిలో ఉపాసన సందడి
upasana kanikakapoor marriage
పెళ్లిలో ఉపాసన సందడి

ఇదీ చూడండి: ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు: బాలయ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.