ETV Bharat / entertainment

కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఎవరంటే? - మిస్టర్​ కింగ్​ సినిమా టీజర్​

సూపర్​స్టార్​ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో పరిచయం కాబోతున్నారు. ఆయనెవరంటే?

Super star krishna
కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఎవరంటే
author img

By

Published : Sep 19, 2022, 10:14 PM IST

ప్రముఖ నటుడు కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో పరిచయం కాబోతున్నారు. ఆయనెవరో కాదు సీనియర్‌ నటి, దర్శకురాలు విజయనిర్మల మనవడు, నటుడు నరేశ్‌ అల్లుడు శరణ్‌కుమార్‌. ఈయన హీరోగా 'మిస్టర్‌ కింగ్‌' అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.

శరణ్‌ గురించి తెలియని కొందరు సినీ అభిమానులు 'ఈ హీరో ఎవరా?' అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం శరణ్‌ ఎవరో తెలిసేలా ఓ వీడియోను రూపొందించి, విడుదల చేసింది. అందులో కృష్ణ, నరేశ్‌, సుధీర్‌బాబు తమ ఫ్యామిలీ నుంచి రాబోతున్న శరణ్‌కు శుభాకాంక్షలు చెబుతూ కనిపించారు. ఇప్పటివరకూ కృష్ణ కుటుంబం నుంచి ఏడుగురు నటులు ప్రేక్షకులను అలరించగా.. తాజాగా ఎనిమిదో యాక్టర్‌గా శరణ్‌ వస్తున్నారు. తన తాత కృష్ణ నుంచి ఎంతో స్ఫూర్తిపొందానని శరణ్‌ తెలిపారు.

శశిధర్‌ చావలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మిస్టర్‌ కింగ్‌'లో యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలు. తనికెళ్ల భరణి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది.

ఇదీ చూడండి: మోహన్​బాబు చేయాల్సిన ఆ హిట్​ సినిమా చిరు చేతికి ఎలా వెళ్లిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.