ETV Bharat / entertainment

ఎన్టీఆర్​ వర్సెస్​ కృష్ణ.. రెండు రోజుల గ్యాప్​లో​ బ్లాక్​బాస్టర్​ మూవీస్ రీరిలీజ్​​ - సీనియర్​ ఎన్టీఆర్​ వర్సెస్​ కృష్ణ

రెండు రోజుల గ్యాప్​లో అలనాటి దిగ్గజ నటులు ఎన్టీఆర్​-కృష్ణ నటించిన బ్లాక్​ బాస్టర్​ హిట్​ సినిమాలు రీరిలీజ్​ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఆ సంగతులు..

NTR Krishna
డు రోజుల గ్యాప్​లో​ రెండు బ్లాక్​బాస్టర్​ మూవీస్​
author img

By

Published : May 24, 2023, 5:44 PM IST

చిత్రసీమలో రీరిలీజ్ ట్రెండ్ జోరు ఆగట్లేదు. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా గత చిత్రాలు మళ్లీ విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఇద్దరు లెజెండ్ హీరోల సినిమాలు రెండు రోజుల గ్యాప్​లో రీరిలీజ్​తో బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. అవే బాక్సాఫీస్ బ్లాక్​ బాస్టర్​ హిట్స్​ 'అడవి రాముడు'-'మోసగాళ్లకు మోసగాడు'. ఈ రెండు చిత్రాలు 4కేలోనే ప్రదర్శన కానున్నాయి.

బ్లాక్​బాస్టర్​ అడవిరాముడు.. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఆయన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'అడ‌వి రాముడు'ను రీ రిలీజ్ చేయనున్నారు. మే 28న తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవ‌ర్‌సీస్‌లోనూ ఈ సినిమా స్పెష‌ల్ ప్రీమియ‌ర్స్ స్క్రీనింగ్ వేయనున్నారు. ఈ సినిమా ప్రింట్స్‌ను రీ మాస్ట‌రింగ్ చేసి 4కే రిసొల్యూషన్​తో విడుదల చేయనుండటం విశేషం. ఈ చిత్రం ద్వారా వ‌చ్చే క‌లెక్ష‌న్స్‌ను సేవా కార్య‌క్ర‌మాల కోసం వినియోగిస్తారని సమాచారం అందింది.

కాగా, రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో 1977లో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ద‌ర్శ‌కుడిగా రాఘ‌వేంద్రార‌వు కెరీర్‌లోనూ ఇదే తొలి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కావ‌డం విశేషం. పలు రికార్డులు తిరగరాసింది. అప్పట్లో 4 సెంటర్లలో ఒక సంవత్సరం పాటు, 8 సెంటర్లలో 200 రోజులు, 35 థియేటర్లలో 100 రోజులు ప్రదర్శితమైంది. అంతేకాకుండా నెల్లూరు కనక మహల్‌ థియేటర్‌లో ప్రతిరోజు 5 షోలతో 100 రోజులు కూడా ఆడింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద హీరోయిన్లుగా నటించారు. జంధ్యాల డైలాగ్స్ అందించారు.ఇక కేవీ మ‌హ‌దేవ‌న్ అందించిన సాంగ్స్​.. శ్రోతలను ఓ ఊపు ఊపాయి. దాదాపు 45ఏళ్ల త‌ర్వాత ఈ చిత్రం మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో విడుదల అయ్యేందుకు సిద్ధం అవ్వడంతో నంద‌మూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సూపర్​స్టార్​ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా.. మే 31న 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' సినిమా రీ రిలీజ్ కానుంది. కృష్ణ కెరీర్​లోని బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల్లో ఈ చిత్రం ఒకటి. కృష్ణ - విజయనిర్మల జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ తెరకెక్కించారు. సుమారు 52 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రాన్ని.. ఇప్పుడు మే 31న 4కే వెర్షన్‌లో రీ రిలీజ్‌ చేయనున్నారు. రీసెంట్​గా ఈ చిత్ర రీ రిలీజ్‌ ట్రైలర్‌ను కూడా మహేశ్‌బాబు విడుదల చేశారు. అలా రెండు రోజుల గ్యాప్​లోనే ఇద్దరు లెజండ్ హీరోల బ్లాక్​బాస్టర్​ సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ కానుండ‌టం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఈ సినిమాలు రీరిలీజ్​ చేస్తే.. భారీ వసూళ్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.