ETV Bharat / entertainment

టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్​.. 2024 సమ్మర్​కే టార్గెట్​! - NTR 30 2024 summer release date

టాలీవుడ్​లో ప్రస్తుతం రూపొందుతున్న పలు స్టార్ హీరోల భారీ బడ్జెట్​ చిత్రాలు వచ్చే ఏడాది వేసవికి బెర్త్​ ఖారారు చేసుకున్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

NTR 30 pushpa 2
టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్​.. ఇవన్నీ 2024 సమ్మర్​కే టార్గెట్​!
author img

By

Published : Feb 20, 2023, 4:46 PM IST

Updated : Feb 20, 2023, 5:42 PM IST

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పలు భారీ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీటి కోసం అభిమానులు ఎంతో కాలంగా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీటిలో చాలా చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇవన్నీ అత్యంత భారీ బడ్జెట్​తో భారీ హంగులతో రూపొందుతున్నాయి. వీటిని తెరకెక్కించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే వీటిలో కొన్ని మాత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వీటిలో ఒకటి పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్​-సుకుమార్ కాంబినేషనల్​లో రూపొందుతున్న చిత్రమిది. తొలి భాగం దేశవ్యాప్తంగా సూపర్ హిట్ కావడంతో రెండో భాగంగాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్​ ఇటీవలే షూటింగ్​ ప్రారంభించుకుంది. రీసెంట్​గా విశాఖపట్నంలో భారీ సెట్స్​ను తీర్చిదిద్ది.. కథనాయకుడి పరిచయ సన్నివేశాలు, గీతం చిత్రీకరించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్​ నాటికి తీసుకురావాలని మేకర్స్​ ప్లాన్ చేస్తున్నారట.

మెగా పవర్​స్టార్​ రామ్‌చరణ్‌ - దిగ్గజ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూ.200కోట్లకుపైగా బడ్జెట్​తో రూపొందుతున్న ఆర్​సీ 15 ప్రాజెక్ట్​కు సంబంధించి కచ్చితమైన రిలీజ్​ డేట్ బయటకు​ రావట్లేదు. అసలీ చిత్రాన్ని 2023 వేసవికి విడుదల చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత దర్శకుడు శంకర్​ ఏకకాలంలో యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​తో భారతీయుడు 2 సినిమా కూడా చేస్తుండటం వల్ల.. ఆర్​ సీ 15 ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని 2024 సమ్మర్​కు రిలీజ్​ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే టాలీవుడ్​ మోస్ట్​ వెయిటింగ్​ చిత్రాల్లో ఎన్టీఆర్-కొరటాల.. NTR 30 ఒకటి. ఇంతవరకు సెట్స్​పైకే వెళ్లలేదు. అయితే అప్డేట్స్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఇటీవలే ఎన్టీఆర్​.. వారిపై కోపం వ్యక్తం చేస్తూ నోరు విప్పారు. ఈ చిత్రాన్ని ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో సెట్స్​పైకి తీసుకెళ్లబోతున్నట్లు వెల్లడించారు. ముందుగా చెప్పినట్టే అనుకున్న తేదీకే వచ్చే ఏడాది ఏప్రిల్​ 5న అంటే వేసవికి రిలీజ్​ చేస్తామని స్పష్టతనిచ్చారు.

ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలను ప్రకటిస్తూ షూటింగ్​లతో బిజీగా గడుపుతున్న పాన్​ ఇండియా ప్రభాస్.. దర్శకుడు మారుతీతోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హారర్​ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని కూడా 2024 సమ్మర్​కే ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

ఇదీ చూడండి: 'సార్' కలెక్షన్స్​ బ్రేక్​ ఈవెన్ టార్గెట్​ కంప్లీట్​.. 'వినరో భాగ్యము విష్ణు కథ'కు ఎంతంటే?

Last Updated : Feb 20, 2023, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.