ETV Bharat / entertainment

త్వరలోనే 'ఎన్​బీకే 107' టైటిల్​ అనౌన్స్​మెంట్​.. కర్నూల్​లో బాలయ్య రోర్​! - ఎన్​బీకే 107

ఎన్​బీకే 107పై అభిమానులకు ఆసక్తి కలిగించే ఓ అప్డేట్​ వచ్చింది. టీచర్​ విడుదలైనా ఇంకా వర్కింట్​ టైటిల్​తోనే షూటింగ్​ కొనసాగిస్తున్న చిత్రబృందం త్వరలోనే టైటిల్​ను ప్రకటించనున్నట్లు సమాచారం. అంతేకాదు కొత్త షెడ్యూల్​లో భాగంగా మూవీటీమ్​ కర్నూల్​లో షూటింగ్​ను నిర్వహించనుంది.

balayya
బాలయ్య
author img

By

Published : Jul 17, 2022, 10:35 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్​ మలినేని దర్శకత్వంలో ఓ మాస్​ యాక్షన్​ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్​ అభిమానులను ఆకట్టుకుంది. బాలయ్య గెటప్​, పవర్​ఫుల్​ డైలాగ్స్​ చూసి అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు టైటిల్​పై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టైటిట్​, షెడ్యూల్​కు సంబంధించి ఆసక్తికర అప్​డేట్​ వచ్చింది.

ఈ సినిమా టైటిల్​ను చిత్రబృందం త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా షూటింగ్​ కర్నూల్​లో జరగనుందట. ఈ కొత్త షెడ్యూల్​ ఈనెల 24 నుంచి ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్​​గా శృతి హాసన్ నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి : లలిత్​ మోదీ కూతురు.. సుస్మితా సేన్​కు ఏ మాత్రం తీసిపోలేదుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.