Nani 31 Movie SJ Suryah : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'హాయ నాన్న' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. అయితే ఈలోగా నాని ఓ కొత్త సినిమాకు సైన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. 'అంటే సుందరానికి' ఫేమ్ దర్శకుడు వివేక్ ఆత్రేయతో నాని మరోసారి పని చేస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో నాని, ప్రియాంక అరుల్ మోహన్‌తో పాటు తమిళ నటుడు కమ్ దర్శకుడు ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది
ఈ చిత్రంలో ఎస్జే సూర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. అయితే తన పాత్ర కోసం ఎస్జే సూర్య ఏకంగా ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నారని సమాచారం. ఓ రోల్ కోసం ఆయన ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవటం ఇదే మొదటిసారి.
ఈ మధ్య కాలంలో ఎస్ జే సూర్య నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంటున్నాయి. అవుతున్నాయి. దీంతో ఇప్పుడు నాని సినిమాలో ఆయన నటించడం వల్ల తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి మార్కెట్ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఎస్ జె సూర్య గతంలో మహేశ్ బాబు 'స్పైడర్' సినిమాలో విలన్‌గా కనిపించారు. ఇక రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
-
Delighted to have the majestic @iam_SJSuryah on board and he's ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
">Delighted to have the majestic @iam_SJSuryah on board and he's ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGqDelighted to have the majestic @iam_SJSuryah on board and he's ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. గ్యాంగ్ లీడర్ తర్వాత ప్రియాంక అరుల్ మోహన్, నాని కలిసి మరో సారి ఈ సినిమాలో పని చేస్తున్నారు. అలాగే దర్శకుడు వివేక్ ఆత్రేయకు నానితో ఇది రెండో సినిమా. జేక్స్ బిబోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఓ విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని టాక్. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విశేషం ఏమిటంటే.. షూటింగ్ మూహూర్తం షాట్‌ను ఎస్ జే సూర్యనే డైరెక్ట్ చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను మూవీ టీమ్ షేర్ చేసింది.
-
Team #SaripodhaaSanivaaram all smiles at the Pooja ceremony! ❤️
— DVV Entertainment (@DVVMovies) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
With positivity in abundance, we're set to embark on a memorable journey 🤗
🎬 Clap by #VVVinayak garu
🎥 Switched on by #DilRaju garu
🎬 First shot direction by @Iam_SJSuryah garu
The shoot kicks off in November… pic.twitter.com/CN2hx0Or1P
">Team #SaripodhaaSanivaaram all smiles at the Pooja ceremony! ❤️
— DVV Entertainment (@DVVMovies) October 24, 2023
With positivity in abundance, we're set to embark on a memorable journey 🤗
🎬 Clap by #VVVinayak garu
🎥 Switched on by #DilRaju garu
🎬 First shot direction by @Iam_SJSuryah garu
The shoot kicks off in November… pic.twitter.com/CN2hx0Or1PTeam #SaripodhaaSanivaaram all smiles at the Pooja ceremony! ❤️
— DVV Entertainment (@DVVMovies) October 24, 2023
With positivity in abundance, we're set to embark on a memorable journey 🤗
🎬 Clap by #VVVinayak garu
🎥 Switched on by #DilRaju garu
🎬 First shot direction by @Iam_SJSuryah garu
The shoot kicks off in November… pic.twitter.com/CN2hx0Or1P
రామ్‌చరణ్ 'RC15'లో స్టార్ డైరెక్టర్.. యుద్ధ వీరుడిగా హీరో సూర్య!