ETV Bharat / entertainment

kalyan ram devil release date : కల్యాణ్​ రామ్​ సేఫ్​ గేమ్​ ప్లాన్​.. వర్కౌట్​ అయితే.. - నందమూరి హీరో కళ్యాణ్ రామ్ డెవిల్ గ్లింప్స్​

kalyan ram devil release date : కల్యాణ్ రామ్ రామ్ డెవిల్​ రిలీజ్ విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

Kalyan Ram devil
kalyan ram devil release date : కల్యాణ్​ రామ్​ సేఫ్​ గేమ్​ ప్లాన్​.. వర్కౌట్​ అయితే..
author img

By

Published : Aug 6, 2023, 3:03 PM IST

kalyan ram devil release date : నందమూరి హీరో కల్యాణ్ రామ్.. 'బింబిసార' సినిమాతో కెరీర్​లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత బింబిసార్ ఇచ్చిన సక్సెస్​ జోష్​తో 'అమిగోస్'తో రాగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ సారి ఎలాగైనా పక్కా ప్లాన్​ అండ్ స్టోరీతో వచ్చి హిట్​ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నుంచి త్వరలో థియేటర్లలోకి రానున్న చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' అనే ట్యాగ్ లైన్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ సినిమా విడుదల విషయంలో కల్యాణ్ రామ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని అర్థమవుతోంది.

సేఫ్​ గేమ్​ ప్లాన్.. తాజాగా 'డెవిల్' మూవీ రిలీజ్ డేట్​ను ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్లు మూవీటీమ్​ అఫీషియల్​గా అనౌన్స్​మెంట్ చేసింది. డెవిల్ డీకోడింగ్ అంటూ కల్యాణ్​రామ్​కు సంబంధించిన ఓ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. అయితే నవంబర్​లో దాదాపుగా ఎలాంటి సినిమాలు విడుదల కావట్లేదు. కేవలం చిన్న సినిమాలో వచ్చేటట్టు కనిపిస్తున్నాయి. ఇది డెవిల్ చిత్రానికి బాగా కలిసొచ్చే విషయమనే చెప్పాలి. అయితే నవంబరు ముందు వెనక మాత్రం బడా హీరోల చిత్రాలు వరుసగా విడుదలకు రెడీగా ఉన్నాయి. అక్టోబర్​లో దసరా కానుకగా 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు'.. డిసెంబర్​లో క్రిస్మస్​ సందర్భంగా 'సైంధవ్', 'హాయ్ నాన్న' వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక ఓజీ కూడా డిసెంబర్​ ప్లాన్ చేస్తున్నారని రెండు మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

ఇవన్నీ లెక్కలు వెసుకుని ఏ బడా సినిమా లేని నవంబర్​ నెలలో డెవిల్​ను థియేటర్లలోకి వదులుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమా కంటెంట్​ క్లిక్ అయితే మాత్రం కల్యాణ్ రామ్ సేఫ్ గేమ్​ ప్లాన్ సక్సెస్​ అవుతుంది. ఆయన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్​ హిట్ పడుతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎంత వరకు క్లిక్ అవుతుందో..

Kalyan ram devil glimpse : ఇక ఈ చిత్రంలో బింబిసార హీరోయినే సంయుక్త మేననే హీరోయిన్​గా నటిస్తోంది. నవీన్ అనే కొత్త డైరెక్టర్​ ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్​పై అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలిసింది. ఇటీవలే కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన డెవిల్ యాక్షన్ గ్లింప్స్ కూడా నందమూరి ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది. పీరియాడిక్ ఫిల్మ్​గా ఈ సినిమా రాబోతుంది. హీందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. బీ4యూ మోషన్ పిక్చర్స్ అక్కడ సినిమాను విడుదల చేయనుంది.

ఇదీ చూడండి :

ఎన్టీఆర్​-కల్యాణ్​ రామ్​ కాంబోలో బ్లాక్ బాస్టర్ మూవీ మిస్​.. ఇది వచ్చుంటేనా బాక్సాఫీస్ బద్దలే!

ఇంట్రెస్టింగ్​గా కల్యాణ్​ రామ్​ 'డెవిల్' గ్లింప్స్​.. 'గూఢ‌చారి అంటే ఇలానే ఉండాలా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.