Nagarjuna Akkineni Sankranthi Movies: అక్కినేని నాగార్జున 'నా సామిరంగ' సినిమాతో మరోసారి సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బుకింగ్స్ ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున సినీ కెరీర్లో ఇప్పటివరకు ఆరుసార్లు పొంగల్ ఫైట్‌లో నిలిచి 100 శాతం సక్సెస్ రేట్ సాధించారు. మరి ఆ సినిమాలేంటో తెలుసుకుందాం
మజ్ను: 1987లో తొలిసారి నాగార్జున 'మజ్ను' సినిమాతో సంక్రాంతి పోటీలో నిలిచారు. సూపర్ గుడ్ లవ్‌స్టోరీతో తెరెకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. దీంతో పొంగల్ బరిలో దిగిన తొలిసారే విజేతగా నిలిచారు నాగార్జున.
కిల్లర్: యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన 'కిల్లర్' 1992 జనవరి 10న రిలీజైంది. హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ 100 రోజులు థియేటర్లలో ఆడింది. తర్వాత ఈ సినిమాను తమిళంలోకి కూడా డబ్బింగ్ చేశారు.
ఆవిడ మా ఆవిడే: నాగార్జున- ఈవీవీ సత్యనారాయణ కాంబోలో తెరకెక్కిన 'ఆవిడ మా ఆవిడే' 1998 సంక్రాంతికి రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా, కలెక్షన్ల పరంగా దూసుకెళ్లి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
సోగ్గాడే చిన్ని నాయనా: దాదాపు 18 ఏళ్ల తర్వాత 2016లో నాగార్జున పొంగల్ ఫైట్‌లో దిగారు. అంచనాలు లేకుండా 'సోగ్గాడే చిన్ని నాయనా'తో వచ్చి బంపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. 2016 సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో అత్యధిక లాభాలు పొందిన సినిమాగా నిలిచి రికార్డు కొట్టింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బంగార్రాజు: 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వెల్‌గా రూపొందిందే 'బంగార్రాజు'. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కూడా నటించారు. 2022లో సంక్రాంతి ఫైట్‌లో నిలిచి ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నా సామిరంగ: 2024లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్‌ను బలంగా నమ్ముకున్నారు. 'బంగార్రాజు' రిలీజైన జనవరి 14నే 'నా సామిరంగ' ను విడుదల చేశారు. ఈ పోటీలో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా హిట్ టాక్ సొంతం చేసుకుందీ మూవీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'నా సామి రంగ' రివ్యూ : నాగార్జున మాస్ జాతర ఎలా ఉందంటే?
హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న 'నా సామిరంగ' - ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?