Naga Chaitanya Youtube Channel : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్.. సినీ తారలను, వారి ఫ్యాన్స్‌కు దగ్గర చేస్తున్నాయి. సెలబ్రిటీలు వారి లేటెస్ట్ అప్డేట్లు, సినిమా విశేషాలు అన్నీ ఇందులోనే షేర్ చేస్తుంటారు. అయితే ఇదివరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉండగా.. ఇప్పుడు యూట్యూబ్‌లో ఛానెల్ ప్రారంభిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ఈ లిస్ట్‌లో చేరిపోయారు. ఆయన Akkineni Naga Chaitanya పేరుతో యూట్యూబ్‌లో ఛానెల్ ప్రారంభించినట్లు తెలిపారు
ఈ సందర్భంగా ఈయన ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ నెటిజన్ ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. 'చాలాకాలం తర్వాత జుట్టు, గడ్డం పెంచారు. కారణమేంటి?' అని అడగ్గా.. 'పనిలేక జట్టు, గడ్డం పెంచా' అని సరదాగా అన్నారు. అయితే నాగచైతన్య - డైరెక్టర్ చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న 'ఎన్సీ23' (వర్కింగ్ టైటిల్) సినిమా కోసమే జట్టు, గడ్డం పెంచినట్లు క్లారిటీ ఇచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముచ్చటగా మూడోసారి.. నాగచైతన్య - చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. ఇదివరకు ఈ కాంబోలో 'ప్రేమమ్', 'సవ్యసాచి' సినిమాలు వచ్చాయి. ఇందులో ప్రేమమ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం దక్కించుకోగా.. సవ్యసాచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా, ఎన్సీ NC23.. మత్స్యకారుల జీవితాలను అద్దం పట్టే ఓ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరో నాగచైతన్య కొత్త లుక్‌లో కనిపించనున్నారు. అందుకు తగ్గట్లుగా ఆయన బాడీని మార్చుకుంటున్నారు. సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.
తొలి వెబ్ సిరీస్.. ఇటు సినిమాలు చేస్తూనే 'దూత' తో వెబ్ సిరీస్ల్లోకీ ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య. 'మనం' సినిమా డైరెక్టర్ విక్రమ్ కె కుమార్.. ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో పార్వతి, తిరువోతు, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక 'దూత' ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబరు 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జోరు పెంచిన తెలుగు స్టార్స్.. ఒకేసారి రెండేసి సినిమా షూటింగ్‌లకు సై!
'సామ్ హార్డ్ వర్కర్.. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది'