Ramcharan Jamesbond: ప్రపంచవ్యాప్తంగా 'జేమ్స్ బాండ్' చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. ఈ సిరీస్‌లోని 25వ సినిమా 'నో టైమ్ టు డై' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ సిరీస్‌లోని గత ఐదు చిత్రాల్లో హీరోగా నటించిన డేనియల్ క్రెగ్.. ఈ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పేశారు. దీంతో తర్వాతి బాండ్‌గా ఎవరు కనిపించనున్నారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ పాత్రలో మెగాహీరో రామ్‌చరణ్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ. అయితే త్వరలోనే ఇది నిజమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రముఖ మార్వెల్ రైటర్ చియో హోదారి కోకర్ రామ్‌చరణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన తాజాగా చేసిన ట్వీట్లో.. తర్వాతి బాండ్ పాత్రను ఎవరు బాగా పోషించగలరో తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ రోల్‌ను ఇడ్రిస్ ఎల్బా, మ్యాథ్యూ గూడె, డామ్సన్ ఇద్రిస్, సోప్ దిరిసు, రామ్‌చరణ్ సులభంగా పోషించగలరని ట్వీట్ చేశాడు. ఇందులో చరణ్ పేరు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ చూసిన రామ్‌చరణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. తమ అభిమాన హీరో జేమ్స్ బాండ్ పాత్రలో త్వరలో కనిపించే ఛాన్స్ ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యాక.. హాలీవుడ్ ప్రేక్షకుల,దర్శకులు జక్కన్న టేకింగ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు చరణ్, తారక్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'లుక్కేజ్' సృష్టికర్త చియో హోదారి కోకర్ కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అలానే చరణ్‌ను ఉద్దేశిస్తూ తాజా ట్వీట్ చేశారు.
ఇక చరణ్ సినిమాల విషయాన్నికొస్తే.. ఆయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఆర్సీ 15' చేస్తున్నారు. పవర్‌ఫుల్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనిపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్ మూడు భిన్న గెటప్‌లలో కనిపించనున్నారని సమాచారం. అందులో ఒకటి ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారట. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: 'అవెంజర్స్' రేంజ్లో 'ప్రాజెక్ట్ కె'.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత