ETV Bharat / entertainment

Actor Vijay: నటుడు విజయ్​పై లైంగిక వేధింపుల కేసు - విజయ్​ న్యూస్​

Actor Vijay: మలయాళ నటుడు, నిర్మాత విజయ్​పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడం వల్ల అతడిపై ఎర్నాకుళం పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను నటుడు విజయ్ ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు.

actor vijay
actor vijay
author img

By

Published : Apr 27, 2022, 10:48 AM IST

Updated : Apr 27, 2022, 12:24 PM IST

Actor Vijay: ప్రముఖ మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ విజయ్​ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కాగా, బాధితురాలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు విజయ్​బాబును ఇంకా ప్రశ్నించలేదు. అయితే ఈ ఆరోపణలను నటుడు విజయ్ ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. "నేను ఎటువంటి తప్పు చేయనప్పుడు భయపడను. ఇక్కడ నేను బాధితుడిని. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళ 2018 నుంచి నాకు తెలుసు" అని విజయ్​ అన్నారు.

actor vijay
హీరో విజయ్​ బాబు

కొజికోడ్​కు చెందిన ఓ మహిళ విజయ్‌బాబు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని తనను నమ్మించాడని.. ఈ నెపంతోనే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపింది. కొచ్చిలోని ఓ ఫ్లాట్‌లో విజయ్​.. అనేక సార్లు తనను వేధింపులకు గురి చేశాడని ఆమె పేర్కొంది. అయితే ఈ కేసుపై పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టలేదు. విజయ్​బాబు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ 'ఫ్రైడే ఫిల్మ్ హౌస్'ను స్థాపించాడు. 'ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్' అనే చిత్రానికి ఉత్తమ పిల్లల చిత్రంగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు.

ఇదీ చదవండి: Acharya First review: మెగాఫ్యాన్స్​కు పూనకాలే.. ఫుల్​ మాస్​ మసాలా!

Last Updated : Apr 27, 2022, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.