Mahesh Babu Guntur Karam : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మరో తొమ్మిది రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. త్వరలోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారట. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహించబోతున్నారు? అని అందరిలో ఆసక్తిగా ఉంది.
ముఖ్యంగా విజయవాడ, గుంటూరు అభిమానులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక అప్డేట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ఈ చిత్రానికి గుంటూరు కారం అనే టైటిల్ పెట్టడంతో ఆ ప్రాంతంలో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తారేమో అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. జనవరి 6వ తేదీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందట. ఆ రోజే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారట.
ఇది పక్కన పెడితే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మహేశ్ బాబు మరో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికా థియేటర్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారట. కాలిఫోర్నియాలోని సినీ లాంజ్ ఫ్రీమాంట్ 7 సినిమాస్ స్క్రీన్‌పై ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ కానుందట. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినీ వేడుకలు వెండితెరపై కనిపించనుండడం కూడా చిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. దీంతో మహేశ్ బాబు మరో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసి ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటున్నారు.
-
Be a part of history in the making! 😎
— Prathyangira Cinemas (@PrathyangiraUS) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
𝐅𝐨𝐫 𝐭𝐡𝐞 𝐟𝐢𝐫𝐬𝐭 𝐭𝐢𝐦𝐞 𝐞𝐯𝐞𝐫, experience a SUPER GHAATU live screening of the #GunturKaaram 𝐏𝐫𝐞-𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐄𝐯𝐞𝐧𝐭 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐔𝐒𝐀 🔥
📍Cine Lounge Fremont 7 Cinemas, California
Details for entry passes will… pic.twitter.com/1vaMVSrQbd
">Be a part of history in the making! 😎
— Prathyangira Cinemas (@PrathyangiraUS) January 2, 2024
𝐅𝐨𝐫 𝐭𝐡𝐞 𝐟𝐢𝐫𝐬𝐭 𝐭𝐢𝐦𝐞 𝐞𝐯𝐞𝐫, experience a SUPER GHAATU live screening of the #GunturKaaram 𝐏𝐫𝐞-𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐄𝐯𝐞𝐧𝐭 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐔𝐒𝐀 🔥
📍Cine Lounge Fremont 7 Cinemas, California
Details for entry passes will… pic.twitter.com/1vaMVSrQbdBe a part of history in the making! 😎
— Prathyangira Cinemas (@PrathyangiraUS) January 2, 2024
𝐅𝐨𝐫 𝐭𝐡𝐞 𝐟𝐢𝐫𝐬𝐭 𝐭𝐢𝐦𝐞 𝐞𝐯𝐞𝐫, experience a SUPER GHAATU live screening of the #GunturKaaram 𝐏𝐫𝐞-𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐄𝐯𝐞𝐧𝐭 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐔𝐒𝐀 🔥
📍Cine Lounge Fremont 7 Cinemas, California
Details for entry passes will… pic.twitter.com/1vaMVSrQbd
కాగా గతంలో టీజర్, గ్లింప్స్, మోషన్ పోస్టర్ ఇలా చాలా ట్రెండ్స్‌ను మహేశ్ స్టార్ట్ చేశారు. ఖలేజాతో టీజర్ రిలీజ్, స్పైడర్‌తో గ్లింప్స్ రిలీజ్, 1-నేనొక్కడినేతో మోషన్ పోస్టర్ రిలీజ్, 1-నేనొక్కడినేని థియేటర్‌లో లైవ్ టెలికాస్ట్ చేయడం, ఈవెంట్‌లో Q&A సెషన్ నిర్వహించడం, ఆగడు ఫస్ట్ లుక్‌ను ఫ్యాన్స్‌తో విడుదల చేయించడం, పోకిరితో రీ రిలీజ్ ట్రెండ్, ఇలా ఇవ్వని స్టార్ట్ చేసి ట్రెండ్ సెట్టర్‌గా ఉన్నారు. ఇప్పుడు మరో ట్రెండ్‌ను స్టార్ట్ చేశారు.
అతడు, ఖలేజా తర్వాత హీరో మహేశ్ బాబు- డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటీనటులు సినిమాలో సందడి చేయనున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్లు, పాటలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మహేశ్, శ్రీలీల ఫుల్ మాస్ డ్యాన్స్- 'కుర్చీని మడతబెట్టి' సాంగ్ అదుర్స్!