ETV Bharat / entertainment

'గుంటూరు కారం' షూటింగ్​కు మళ్లీ బ్రేక్​!.. సంక్రాంతికి రిలీజ్​ కష్టమేనా? - మహేశ్​ బాబు గుంటూరు కారం రిలీజ్​ డేట్​

Mahesh Babu Guntur Kaaram : హీరో మహేశ్​ బాబు- త్రివిక్రమ్​ కాంబోలో రానున్న తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమా షూటింగ్​ చాలా రోజుల క్రితమే మొదలుపెట్టినప్పటికీ.. కష్టాలు మాత్రం వదలట్లేదు. ఈ సినిమా తదుపరి షూటింగ్​ షెడ్యూల్ మళ్లీ​ వాయిదా పడిందట. దీంతో మహేశ్​ ఫ్యాన్స్​ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతోంది? సంక్రాంతికి రిలీజ్​ కష్టమేనా?

guntur kaaram
guntur kaaram
author img

By

Published : Jun 16, 2023, 4:24 PM IST

Updated : Jun 16, 2023, 4:36 PM IST

Mahesh Babu Guntur Kaaram : సూపర్ స్టార్ మహేశ్​ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమా షూటింగ్​కు సంబంధించి చిత్ర యూనిట్​కు వరుస సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా ప్రారంభంలో స్క్రిప్ట్​లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మరికొన్ని షెడ్యూల్స్​ను ఇటీవల రద్దు అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ మూవీ షూటింగ్ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.

Mahesh Guntur Kaaram Shooting : 'గుంటూరు కారం' మూవీ షూటింగ్​కు సంబంధించి కొత్త షెడ్యూల్ జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రంలో నటిస్తున్న కొంతమంది నటీనటులు డేట్స్ సమస్యల కారణంగా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. వాస్తవానికి జూన్​ 7వ తేదీనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ జూన్ 12న వాయిదా వేశారు. ఇప్పుడు అది కాస్త జూలై నెలకు వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 12న మొదలవ్వాల్సిన లేటెస్ట్ షెడ్యూల్​ను ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో జూన్ 20కు మార్చారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం షూటింగ్ జూలై నెలకు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఇలా 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో చిత్ర యూనిట్​పై మహేశ్​ బాబు ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలానే షూటింగ్ వాయిదా పడితే సినిమా అనుకున్న సమయానికి విడుదల అవ్వడం కష్టమే అని చెబుతున్నారు.

Mahesh Guntur Kaaram Glimpse : ఇప్పటికే మూవీ యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేసిన టీజర్ గ్లింప్స్​ భారీ రెస్పాన్స్​ను అందుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను తారస్థాయికి చేర్చింది. ఇప్పటివరకు యూట్యూబ్​లో ఈ టీజర్ గ్లింప్స్​కు ఏకంగా 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Mahesh Guntur Kaaram Cast : త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ సినిమాలో మహేశ్​ బాబులో ఉన్న మాస్​ను పూర్తిగా బయటికి తీసే ప్రయత్నం చేసినట్లు టీజర్ గ్లింప్స్​ వీడియో చూస్తేనే అర్థమవుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్​పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్​ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్​గా నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు పీఎస్ వినోద్, ఏఎస్ ప్రకాశ్​, నవీన్ నులి, రామ్ లక్ష్మణ్ వంటి అగ్ర సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల అనంతరం సుమారు 12 సంవత్సరాల తర్వాత మహేశ్​, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం' పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాలను ఈ సినిమా ఏ మేర అందుకుంటుందో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 16, 2023, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.