Liger Movie Released: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన మోస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైగర్' ఎట్టకేలకు గురువారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 పైగా థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. అయితే, గురువారం ఉదయం ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్క ఆడియన్, ముఖ్యంగా అక్కినేని అభిమానులు కింగ్ నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'నాగ్ అదుర్స్' అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు.. 'లైగర్'కు నాగార్జునకు సంబంధం ఏమిటి? ఈ చిత్రం చూడటానికి వచ్చిన వాళ్లు నాగార్జునను ఎందుకు మెచ్చుకొంటున్నారు?
-
Yendhanna ee ARACHAKAM🔥🔥
— 👑NAG (@priyathamKING) August 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
K ramp Trailer 💥
After many days 😭😭@iamnagarjuna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻#TheGhost #TheGhostTrailer pic.twitter.com/Mcttuw0W15
">Yendhanna ee ARACHAKAM🔥🔥
— 👑NAG (@priyathamKING) August 25, 2022
K ramp Trailer 💥
After many days 😭😭@iamnagarjuna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻#TheGhost #TheGhostTrailer pic.twitter.com/Mcttuw0W15Yendhanna ee ARACHAKAM🔥🔥
— 👑NAG (@priyathamKING) August 25, 2022
K ramp Trailer 💥
After many days 😭😭@iamnagarjuna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻#TheGhost #TheGhostTrailer pic.twitter.com/Mcttuw0W15
'బంగార్రాజు' తర్వాత నాగార్జున నటిస్తోన్న సరికొత్త చిత్రం 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్నఈ సినిమాలో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయిక. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 'ది ఘోస్ట్' ట్రైలర్‌ని మహేశ్‌బాబు చేతుల మీదగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసింది. మరోపక్క తాజాగా విడుదలైన 'లైగర్' చిత్రానికి 'ది ఘోస్ట్' ట్రైలర్‌ను ఎటాచ్ చేశారు. 'లైగర్' విరామ సమయంలో 1.55 నిమిషాల నిడివి గల 'ది ఘోస్ట్' ట్రైలర్‌ని ప్లే చేశారు. ఇందులో నాగార్జున లుక్, ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ సీన్స్.. చూసి సినీ ప్రియులు మనసు పారేసుకుంటున్నారు. వింటేజ్ నాగ్‌ని చూసినట్లు ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.
అభిమానులతో సినిమా చూసిన విజయ్, అనన్య
తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ చిత్రంగా తెరకెక్కిన 'లైగర్'ను ప్రేక్షకులతో కలిసి వీక్షించారు నటుడు విజయ్ దేవరకొండ. 'లైగర్' బ్యూటీ అనన్య పాండేతో కలిసి గురువారం ఉదయం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో సందడి చేశారు. విజయ్‌ని చూసిన వెంటనే అక్కడున్న అభిమానులు 'లైగర్', 'లైగర్' అంటూ నినాదాలు చేశారు. అభిమానులు తనపై చూపిస్తోన్న ప్రేమకు ఫిదా అయిన విజయ్ వారికి అభివాదం చేసి.. అనంతరం 'లైగర్'ను వీక్షించారు. మాస్‌లో విజయ్‌కున్న ఫాలోయింగ్ చూసి పక్కనే ఉన్న అనన్య పాండే ఫిదా అయ్యారు.
మరోవైపు తమ అభిమాన హీరో సినిమా రిలీజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో విజయ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, తీన్‌మార్ డ్యాన్స్‌లతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైగర్'. ఎంఎంఏ (మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్) నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలు పోషించారు. విజయ్‌కు జోడీగా నటి అనన్య సందడి చేశారు.
ఇవీ చదవండి: RC 15 ప్రాజెక్ట్‌పై శంకర్ క్లారిటీ, రెండూ ఒకేసారి జరుగుతాయంటూ
మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న అవతార్, ఆ ఎఫెక్ట్స్‌తో సరికొత్తగా