ETV Bharat / entertainment

రుద్రుడుగా లారెన్స్​.. స్పెషల్ గ్లింప్స్ గూస్​ బంప్స్​ తెప్పిస్తోందిగా! - lawrence rudrudu release date

కొరియోగ్రాఫర్​, నటుడు రాఘవ లారెన్స్ నటించిన రుద్రుడు నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఓ గ్లింప్స్​ను విడుదల చేశారు. ఇందులో రుద్రుడుగా లారెన్స్ కనిపించి అదరగొట్టేశారు.

Lawrence Rudrudu glimpse released
రుద్రుడుగా లారెన్స్​.. స్పెషల్ గ్లింప్స్ గూస్​ బంప్స్​ తెప్పిస్తోందిగా
author img

By

Published : Oct 29, 2022, 7:04 PM IST

రాఘవ లారెన్స్.. కొరియోగ్రాఫర్​గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం హీరోగా, దర్శకుడిగా కెరీర్​లో రాణిస్తున్నారు. హారర్ కామెడీ కాంచన సిరీస్​తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆయన.. త్వరలోనే 'రుద్రుడు' అనే యాక్షన్ థ్రిల్లర్​తో థియేటర్లలో సందడి చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా రుద్రుడు మేకర్స్ మూవీ నుంచి ఓ యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రుద్రుడిగా లారెన్స్ క్యారెక్టర్​ను ఎలివేట్ చేస్తూ.. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్​తో టెర్రిఫిక్​గా ప్రెజెంట్ చేయడం బాగుంది. 'ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్' అనే ట్యాగ్​తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాలో లారెన్స్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్​గా నటిస్తోంది. గ్లింప్స్​లో హీరోయిన్ లుక్ రివీల్ చేయలేదు. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: హీరో ఉపేంద్రపై నటి ప్రేమ సంచలన కామెంట్స్​.. ఫ్యాన్స్​ మండిపాటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.