ETV Bharat / entertainment

సామ్​, చరణ్​, తారక్​లతో 'కాఫీ విత్​ కరణ్'!..​ ఏడో సీజన్​ అప్పటి నుంచే.. - కాఫీ విత్​ కరణ్​ షో చరణ్​

Koffee With Karan Show: హిందీలో అత్యంత పాపులారిటీ షోగా పేరుగాంచిన 'కాఫీ విత్​ కరణ్​' ఏడో సీజన్​ స్ట్రీమింగ్​ డేట్​ను ప్రకటించారు వ్యాఖ్యాత కరణ్ జోహార్​. ఈ సీజన్​లో స్టార్​ హీరోయిన్​ సమంత, హీరోలు తారక్​, చరణ్​, విజయ్​ దేవరకొండ పాల్గొంటారని సమాచారం.

Koffee With Karan Show
Koffee With Karan Show
author img

By

Published : Jun 19, 2022, 5:16 PM IST

Updated : Jun 19, 2022, 5:31 PM IST

Koffee With Karan Show 7th Season: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా ప్రేక్షకాదరణ పొందిన సెలబ్రిటీ చాట్‌ షో 'కాఫీ విత్‌ కరణ్‌'. ఆరు సీజన్లపాటు సాగిన ఈ షో.. ఏడో సీజన్​ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. అందుకు సంబంధించిన వివరాలను కరణ్ జోహర్​ ఆదివారం వెల్లడించారు. జులై 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో ప్రసారం కానుందంటూ ఓ వీడియో ట్వీట్​ చేశారు.

అయితే స్టార్​ హీరోయిన్​ సమంత సీజన్​​ 7తో.. ఈ షోలోకి అరంగేట్రం చేయనున్నారని సమాచారం. అందుకు సంబంధించి షూటింగ్​ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. సమంత ఇటీవలే తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసిన ఫొటోలే ఈ ఊహాగానాలకు తెరలేపాయి. ఆ ఫొటోల్లోని బ్యాక్​గ్రౌండ్​, కరణ్​ ఇటీవలే పోస్ట్​ చేసిన ఫొటోల్లోని బ్యాక్​గ్రౌండ్​ ఒకేలా ఉండటం ఈ ఊహాగానాలకు బలాన్నిచ్చింది. మరి చూడాలి ఏం జరుగుతుందో!

Koffee With Karan Show
సమంత
karan johar
కరణ్​ జోహార్

మరోవైపు, పుష్పతో పాన్ ఇండియా రేంజ్​లో మరింత క్రేజ్ పెంచుకున్న అల్లు అర్జున్.. ఈ టాక్​షోలో పాల్గొంటారని సమాచారం. పుష్పలో తన తోటి నటి రష్మికతో కలిసి కాఫీ విత్ కరణ్​కు బన్నీ వస్తారని తెలుస్తోంది. రామ్​చరణ్, తారక్, విజయ్​ దేవరకొండ సైతం కరణ్ షోలో కనువిందు చేయనున్నట్లు సమాచారం. టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఇప్పటికే రెండుసార్లు ఈ షోకు వెళ్లారు.

Koffee With Karan Show
తారక్​, చరణ్​

ఈ కార్యక్రమం మొట్టమొదటి సారిగా 2004లో స్టార్​ వరల్డ్​ టీవీ ఛానెల్​లో ప్రసారమైంది. అప్పటి నుంచి ప్రేక్షకులను అలరిస్తూ ఆరు సీజన్లు పాటు సాగింది. కరణ్​ జోహార్​ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న 'రాకీ ఔర్​ రాణీకి ప్రేమ్​ కహనీ' చిత్రం.. ఫిబ్రవరి 10, 2023న విడుదల కానుంది.

ఇవీ చదవండి: ఓటీటీలోకి అందాల భామ ఎంట్రీ.. యాక్షన్​ కింగ్​ దర్శకత్వంలో విశ్వక్​సేన్​!

వారంతా సెట్.. నేనొక్కడినే ఇలా.. హిట్ కొట్టగానే...: హీరో ప్రిన్స్​

Last Updated : Jun 19, 2022, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.