ETV Bharat / entertainment

'బిగ్​బీ తర్వాతి స్థానం అతడిదే'.. కంగన షాకింగ్ కామెంట్స్! - కేజీఎఫ్​ 2

Kangana Comments On Yash: ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు బాలీవుడ్​లో ఫుల్​ క్రేజ్​ను సంపాదించుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన 'కేజీఎఫ్​ 2'.. బీటౌన్​లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రెటీల వరకు యశ్​ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా బాలీవుడ్​ ఫైర్​ బ్రాండ్​ కంగనా.. యశ్​ను పొగుడుతూ ఓ పోస్టు పెట్టింది.

kangana kgf yash
kangana kgf yash
author img

By

Published : Apr 18, 2022, 9:35 PM IST

Kangana Comments On Yash: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ .. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. బ్రేకులు లేని బుల్డోజర్‏లా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. యశ్ నటనకు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి సినీ ప్రియులు ముగ్దులైపోయారు. బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నార్త్‏లోనూ ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'కేజీఎఫ్ 2' మేనియా కొనసాగుతోంది. కేవ‌లం నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి, కొత్త చరిత్రను లిఖించింది. ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్​.. కేజీఎఫ్ స్టార్ యశ్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

kgf 2 collections
'కేజీఎఫ్​ 2'

ఇటీవల కాలంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. సౌత్ ఇండియన్​ స్టార్లపై తెగ ప్రశంసలు కురిపిస్తోంది. ఇప్పటికే రామ్​చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్​లను పొగడ్తలతో ముంచెత్తింది. ఇటీవల ఈ స్టార్ హీరోస్ పూజలు చేస్తున్న ఫోటోలను.. చరణ్, తారక్ మాలలు వేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ దక్షిణాది స్టార్స్ ఎంతో ఒదిగి ఉంటారని.. తమ సంస్కృతిని కాపాడుకోవడానికి ఎప్పుడూ ముందుంటారని చెప్పుకొచ్చింది. తాజాగా తన ఇన్‏స్టాలో యశ్ ఫోటోను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "కొన్నేళ్లుగా భారత చలనచిత్ర పరిశ్రమ మిస్ అవుతున్న 'యాంగ్రీ యంగ్ మ్యాన్' యశ్. అమితాబ్ బచ్చన్ తర్వాత 1970ల నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్ని యశ్ భర్తీ చేయబోతున్నాడు" అంటూ చెప్పుకొచ్చింది. 1970, 1980ల్లో డాన్, దీవార్, శక్తి, అగ్నిపథ్ వంటి చిత్రాలతో అమితాబ్ 'యాంగ్రీ యంగ్ మ్యాన్' అనే బిరుదును సంపాదించుకున్నారు.

కంగనా రనౌత్​ ఇన్​స్టా పోస్ట్​
కంగనా రనౌత్​ ఇన్​స్టా పోస్ట్​

ఇవీ చదవండి: 'అందులో ఆశ్చర్యమేంటి?'.. సౌత్ సినిమాలపై బీటౌన్ హీరో వ్యాఖ్యలు!

'కేజీఎఫ్​ 2': రాఖీభాయ్​దే హవా.. వరల్డ్​లోనే రెండో చిత్రంగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.