Jigarthanda Double x Clint Eastwood : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తాజాగా తెరకెక్కించిన 'జిగర్తండ డబుల్ ఎక్స్' (Jigarthanda Double X) దీపావళీకి రిలీజై మంచి విజయం సాధించింది. కార్తిక్ మేకింగ్ స్కిల్స్, సినిమాటోగ్రఫీ మూవీని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అయితే దర్శకుడు కార్తిక్, హాలీవుడ్ డైరెక్టర్, నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్‌కు వీరాభిమాని. దీంతో సినిమాలో కొన్ని సీన్స్ ఆయనకు ట్రిబ్యూట్ ఇచ్చేలా పెట్టాడట.
అయితే సినిమా చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్లో క్లింట్ను ట్యాగ్ చేస్తూ 'డియర్ క్లింట్ ఈస్ట్‌వుడ్, భారతీయులమైన మేము జిగర్తండ అనే తమిళ సినిమా రూపొందించాం. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో మేము కొన్ని సీన్స్‌ను మీకు ట్రిబ్యూట్ ఇచ్చాము. అలాగే మీ యంగ్ ఏజ్‌ను గుర్తుచేసేలా కొన్ని యానిమేటెడ్ సీన్స్ జోడించాము. ప్లీజ్ మీకు టైమ్ దొరికినప్పుడు చూడండి' అని రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ క్లింట్ దాకా చేరుకోవడం వల్ల దీనికి పాజిటివ్ రిప్లై వచ్చింది.
'హాయ్, క్లింట్కు జిగర్తండ డబుల్ ఎక్స్ సినిమా గురించి తెలుసు. ఆయన ప్రస్తుతం జ్యురర్ -2 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ నుంచి ఫ్రీ అయ్యాక ఆయన తప్పకుండా సినిమా చూస్తారు. థాంక్యూ' అని క్లింట్ టీమ్ నుంచి రిప్లై వచ్చింది. ఆస్కార్ విన్నర్, తన ఫెవరెట్ నటుడు క్లింట్ టీమ్ నుంచి రిప్లై రావడం పట్ల కార్తిక్ సుబ్బరాజ్, నటుడు రాఘవ లారెన్స్ సంతోషం వ్యక్త పరిచారు.
-
Hi. Clint is aware of this Movie and he states he will get to it upon Completion of his New Film. Juror 2. Thank You. https://t.co/4UpiIOSzdj
— Clint Eastwood Official (@RealTheClint) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hi. Clint is aware of this Movie and he states he will get to it upon Completion of his New Film. Juror 2. Thank You. https://t.co/4UpiIOSzdj
— Clint Eastwood Official (@RealTheClint) December 13, 2023Hi. Clint is aware of this Movie and he states he will get to it upon Completion of his New Film. Juror 2. Thank You. https://t.co/4UpiIOSzdj
— Clint Eastwood Official (@RealTheClint) December 13, 2023
'వావ్, నమ్మలేకపోతున్నాను! లెజెండ్ క్లింట్ ఈస్ట్‌వుడ్ త్వరలో జిగర్తండ సినిమా చూడబోతున్నారు. ఈ మూవీ కోట్లాది మంది భారతీయుల తరఫున క్లింట్కు అంకితం. ఈ సినిమాను క్లింట్ దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్‌కు కూడా థాంక్స్' అని కార్తిక్ ట్విట్ చేశాడు. మరోవైపు 'థాంక్స్ యు సర్, సినిమా మీ వరకూ వచ్చినందుకు సంతోషం. నేను, యస్ జే సూర్య మీకు ఫ్యాన్స్. మా డైరెక్టర్ మీ వీరాభిమాని' అని లారెన్స్ అన్నాడు.

ఈ సినిమాలో సీనియర్ నటుడు ఎస్ జే సూర్య, రాఘవ లారెన్స్ లీడ్ రోల్స్‌లో నటించారు. నవీన్ చంద్ర, నిమిషా, సత్యన్, అరవింద్ ఆకాశ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు కార్తికేయన్, కాథిరిసన్ సంయుక్తంగా రూపొందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Jigarthanda Double X Teaser : ఊరమాస్‌గా జిగర్తాండ డబుల్ X టీజర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?