ETV Bharat / entertainment

Jawan Oscar : షారుక్ 'జవాన్'​కు ఆస్కార్​ రేంజ్ సత్తా ఉందా? - జవాన్ బాక్సాఫీస్ కలెక్షన్స్​

Jawan Oscar : తాను తెరకెక్కించిన జవాన్ చిత్రాన్ని ఆస్కార్​ వరకు తీసుకెళ్లాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు దర్శకుడు అట్లీ. మరి ఈ చిత్రానికి ఆస్కార్ రేంజ్ సత్తా ఉందా?

Jawan Oscar : షారుక్ 'జవాన్'​కు ఆస్కార్​ రేంజ్ సత్తా ఉందా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 10:38 AM IST

Jawan Oscar : కింగ్ ఖాన్ షారుక్​ ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే. ఈ చిత్రం రిలీజై 12 రోజులైనా ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్​గా రన్​ అవుతూ కోట్ల రూపాయలను వసూలు చేస్తోంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూళ్లు చేస్తూ.. రూ. 1000 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఆస్కార్​ అవార్డ్​ వరకు తీసుకెళ్లాలని డైరెక్టర్​ అట్లీ ఆశ పడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. తాను తెరకెక్కించిన 'జవాన్' మూవీ ఆస్కార్ అకాడెమీకి వెళ్లాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. షారుక్ ఖాన్​​తోనూ ఈ విషయం గురించి మాట్లాడతానని అన్నారు.

సాధారణంగా ఓ చిత్రం భారీ రేంజ్​లో సక్సెస్​ సాధిస్తే.. ఏ దర్శకుడైన ఇలా ఆలోచించడం మాములే. కాబట్టి దర్శకుడు అట్లీ కూడా జవాన్ సక్సెస్​ అయిన నేపథ్యంలో ఆస్కార్ కల కనడంలో తప్పేమీ కనిపించడం లేదు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి.. జవాన్​ చిత్రానికి ఆస్కార్​ రేంజ్​ స్థాయికి వెళ్లే అర్హత ఉందా లేదా? అనేది.. ఎందుకంటే 'జవాన్' అనేది ఓ పక్కా హై ఓల్టేజ్​ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సమాజంలోని తప్పు ఒప్పులను ఎత్తి చూపిస్తూ, వాటిని సరిదిద్దటానికి ప్రయత్నం చేసే ఓ వ్యక్తి ఎమోషనల్ జర్నీ. సామాజిక, రాజకీయ అంశాలను లేవెనెత్తుతూ ఒక నార్మల్​ పక్కా కమర్షియల్​గా సినిమాను తీశారు.

విజువల్స్​, యాక్షన్ సీక్వెన్స్​, షారుక్ నటన.. ఇలా ప్రతీది చూడటానికి బాగానే ఉన్నప్పటికీ.. కథలో మాత్రం కొత్తదనం లేదనే చెప్పాలి. కొన్ని దక్షిణాది సినిమాలన్నింటినీ కలిపేసి జవాన్​గా చూపించారన్న అభిప్రాయాలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ బేస్​తో ఇప్పటికే చాలా సినిమాలే తెరపైకి వచ్చాయి. మరి ఇలాంటి చిత్ర విషయంలో అట్లీ ఆస్కార్ అభ్యర్థనను షారుక్​ పరిగణలోకి తీసుకుంటారా? ఒకవేళ నిజంగానే షారుక్​ పరిగణలోకి తీసుకున్నా.. ఈ చిత్రానికి ఆస్కార్​ రేంజ్ సత్తా లేదనే అభిప్రాయాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అట్లీని కూడా ట్రోల్ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Shah Rukh Khan Thalapathy Vijay : షారుక్​ - విజయ్​ కాంబోపై క్లారిటీ ఇచ్చేసిన అట్లీ.. రూ.1500 కోట్లు టార్గెట్​!

Rajinikanth Sharukh Khan : గత పదేళ్ల లెక్క తేల్చేశారు.. రూ.2500కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.